వైద్యులు వర్షాకాలంలో ఎక్కువగా నీటిని వేడి చేసి తాగడం మంచిదంటూ సూచిస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు నది ,బావి, చెరువు మొదలైన నీటి వనరుల నుండి నీటిని తెచ్చుకునేవారు..కాబట్టి మన పెద్దలు కూడా నీటిని గోరువెచ్చగా కాచుకొని మరి తాగేవాళ్లు అయితే మారిన కాలంతో పెరిగిన టెక్నాలజీతో కలుషితమైన నీటిని సేకరించి వాటిని శుద్ధి చేసి మరి మినరల్స్ కలిపి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. మనం ఆ నీటిని తాగడానికి ప్రస్తుతం చాలామంది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.


అయితే వర్షాకాలం లేదా శీతాకాలంలో ఏదైనా జలుబు చేసినప్పుడు గొంతు నొప్పిగా అనిపించినప్పుడు కచ్చితంగా వేడి నీటిని తాగాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరికీ వచ్చే ఒక సందేహం ఏమిటంటే మినరల్ వాటర్ అని వేడి చేసి తాగవచ్చా. అలా చేయడం వల్ల అందులో ఉండే మినరల్స్ నశించిపోతాయా అనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. సాధారణంగా మినరల్ వాటర్ అంటే భూగర్భ జలాల నుంచి సేకరించి శుద్ధి చేయబడిన నీరు అని అర్థము అయితే ఇలా శుద్ధి చేసిన సమయంలో అందులో ఉండే అధిక భాస్వరం వంటి లవణాలు కూడా విడుదలవుతాయట.


అయితే ఇందులో ఉండే ఇతర పోషకాలు మాత్రం విడుదల కావట ఈ ప్రక్రియ ముగిశాక అందులో మరికొన్ని అవసరమైనటువంటి ఖనిజాలను సైతం కలుపుతూ ఉంటారు. ఈ నీరు సాధారణ నీటి కంటే మంచినీళ్ళలాగా అనిపిస్తూ ఉంటుంది. అందుచేతనే వేడి చేస్తూ తాగడం వల్ల ఎలాంటి పోషకాలు నశించవు..ఏ నీటినైనా సరే వేడి చేసుకుని తాగడం చాలా మంచిదని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అయితే తరచూ కూల్ డ్రింక్స్ వంటివి తాగకపోవడమే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి తాగడం వల్ల ఇందులో ఉండే కెమికల్స్ వల్ల చాలా హాని కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా నీటిని మాత్రం గోరువెచ్చగా తాగడమే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: