కరోనా సమయం తర్వాత ప్రతి పదిమందిలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మూడీగా ఉంటూ,అతిగా ఆలోచిస్తూ,డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది.దీనికి కారణం ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలను వారిని వెంటాడటమేనని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.దీనిని ఇలాగే వదిలేస్తే డిస్టర్బ్ అవ్వడమే కాకుండా ప్రాణాలకు కూడా హాని కలుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.ఇలాంటి వారి కోసం వారి మెదడులో కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అయ్యి,వారి మూడ్ ని సెట్ చేసే గుణాలు కొన్ని రకాల ఔషధాలలో పుష్కలంగా ఉన్నాయని,వాటితో తయారు చేసుకునే టీలను తరచూ తీసుకోవడంతో వారి మూడు సెట్ అవుతుంది అని కూడా ఆహార నిపుణులు చెబుతున్నారు.మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే, ఈ ఔషధ గుణాలు కలిగిన టీ తయారు చేసుకుని తాగడం చాలా ఉన్నాయి ఉత్తమం.అది ఎలా తయారు చేసుకోవాలో మనము తెలుసుకుందాం పదండి..

దీనికోసం ముందుగా ఒక స్టవ్ పై ఒక బాండీ పెట్టి, అర లీటర్ నీరు పోసి,ఇందులో రెండు నుంచి మూడు వరకు యాలకులు,ఇంచు దాల్చిన చెక్క,రెండు టీ స్పూన్ల ధనియాలు,రెండు మూడు లవంగాలు వేసి బాగా ఉడికించుకోవాలి.ఇది బాగా ఉడికి రంగు మారిన తర్వాత స్టవ్ పై నుంచి దింపి చల్లారనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చగా ఉన్నప్పుడే,అందులో ఒక స్పూన్ తేనె, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి రోజు పరగడుపున ఆస్వాదిస్తూ తాగాలి.

ఇందులో ఉన్న స్పైసస్ కి రోజంతా యాక్టివ్ గా ఉంచి , మెదడులోని కణాలను సెట్ చేసి,అనవసరమైన ఆలోచనలు కలగకుండా చేసే గుణాలు ఉంటాయి.కొన్ని రకాల ప్లేవర్ లు మన మనసును,మెదడును శాంతపరచడమే కాకుండా,కొత్త ఆలోచనలు కలిగేందుకు దోహదపడతాయి.కావున మీరు కానీ, మీ చుట్టూ ఉన్నవారు కానీ ఈ సమస్యలతో బాధపడుతున్నాట్లయితే ఈ టీ తప్పక తీసుకోవడం అలవాటు చేసుకోండి.దీనితో పాటు యోగా, వాకింగ్, రోజు ఏదొక కొత్త పనిచేయడం,నలుగురితో కలిసి మాట్లాడటం వంటి వాటితో ముడీనెస్ కి గుడ్ బై చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: