ప్రస్తుత కాలంలో ఎక్కువగా మానసిక సమస్యలు చాలామందిని వెంటాడుతున్నాయి. అయితే, మనలో చాలా మంది కూడా ఈ మానసిక ఆరోగ్యాన్ని లైట్ తీసుకొని అంత సీరియస్‌గా తీసుకోరు.కానీ శారీరక ఆరోగ్యంతో పాటు ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి.ఈ రోజుల్లో ప్రజలు చాలా రకాల ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీని కారణంగా శరీరం, తల బరువుగా మారడం ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. వెన్ను నొప్పి, మెడ గుంజడం ఇంకా తలనొప్పి తీవ్రస్థాయిలో పెరుగుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో.. పెయిన్ కిల్లర్స్ లేదా మరేదైనా మందులు తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా పరిశోధనలు కూడా వాటి దుష్ప్రభావాలను వెల్లడించాయి. దానికి కొంత ఆయుర్వేద చికిత్స తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. తలనొప్పి తీవ్రంగా వేధిస్తుంటే ఆయుర్వేదంతో ఈజీగా చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు. ఇక తలనొప్పికి ఆయుర్వేద చికిత్స ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


మానసిక అలసట, తల భారం ఇంకా తలనొప్పితో బాధపడేవారు తరచుగా జ్ఞాపకశక్తి కోల్పోతూ ఉంటారు. దీనిని వదిలించుకోవడానికి మీరు బ్రాహ్మిని తినవచ్చు. ఇది మానసిక భారం ఇంకా అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.అలాగే అశ్వగంధ ఒక ఆయుర్వేద ఔషధం. ఇది మానసిక రుగ్మతలు ఇంకా తలలో భారం కోసం ఖచ్చిత నివారణగా పరిగణిస్తారు. మీరు మానసికంగా చురుకుగా, టెన్షన్ లేకుండా ఉండటానికి దీనిని ఈజీగా ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు మన మెదడుకు అన్ని విధాలా మేలు చేస్తాయి.అలాగే శంఖపుష్పి తీసుకోవడం మెదడుకే కాకుండా శరీరానికి కూడా సమానంగా మేలు చేస్తుంది. దీన్ని ఆయుర్వేద నిధి అని పిలుస్తారు. ఇది మనసులోని భారాన్ని దూరం చేస్తుంది. మీరు ఈ పువ్వుతో తయారు చేసిన షర్బట్ లేదా సిరప్ కూడా తాగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: