మన ఇంట్లోకి వచ్చే ఎన్నో రకాల కీటకాల్లో ఈగలు కూడా ఒకటి. ఇవి ఎక్కువగా వంట పాత్రలపై, పండ్లపై, కూరగాయలపై ఇంకా అలాగే వంట చేసే చోట వాలి మనకు చాలా చికాకును కలిగిస్తూ ఉంటాయి.ఇంకా ఈ ఈగల ద్వారా వైరస్, బ్యాక్టీరియాలు ఒక చోట నుండి మరో చోటుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. ఈగలు చాలా రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఈగల ద్వారా కలరా, వాంతులు, అతిసారం, విరోచనాలు ఇంకా డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇంట్లోకి ఈగలు రావడానికి గల కారణాల్లో ఇళ్లు శుభ్రంగా లేకపోవడం కూడా ఖచ్చితంగా ఒకటి. ఎందుకంటే ఇంట్లో ఉండే అపరిశుభ్రమైన వాతావరణం కారణంగా ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.మన ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంకా అలాగే ఇంటి పరిసరాలు కూడా ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ఇంకా వీటితో పాటు కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇంట్లోకి ఈగలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈగలు ఉన్న చోట ఓ కర్పూరాన్ని వెలిగించి పొగ వచ్చేలా చేయాలి.


ఆ కర్పూరం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో ఉండే ఈగలు ఈజీగా బయటకు పోతాయి. ఇంకా అలాగే తులసి చెట్టును ఇంటి చుట్టు ఉండేలా చూసుకోవాలి. తులసి చెట్టు వల్ల ఇంట్లోకి, ఇంటి పరిసరాల్లో ఈగలు రాకుండా ఉంటాయి. ఇంకా అలాగే నీటిలో కారంపొడి కలిపి ఈగలు ఎక్కువగా ఉండే, ఇంటి చుట్టూ స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ఈగలు ఈజీగా పారిపోతాయి. ఇంకా అలాగే ఒక గిన్నెలో డిష్ వాషర్ లిక్విడ్ ను తీసుకోవాలి.అలాగే ఇందులో ఆపిల్ సైడ్ వెనిగర్ వేసి కలిపి ఇంట్లోకి ఈగలు వచ్చే చోట ఉంచాలి. ఇక ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి ఈగలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇంకా అదే విధంగా లావెండర్, యూకలిప్టస్, పిప్పర్ మెంట్ ఇంకా నిమ్మగడ్డితో తయారు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ ను వంట గదిలో అలాగే ఈగలు ఎక్కువగా ఉండే చోట స్ప్రే చేయాలి. ఈ స్ప్రే చేయడం వల్ల ఈ వాసనకు ఈగలు ఈజీగా బయటకు పోతాయి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల ఈగల బెడద నుండి సహజ సిద్దంగా బయట పడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: