ఈ మధ్యకాలంలో ప్రపంచాన్ని వణికిస్తున్న జబ్బులలో మధుమేహం మొదటి స్థానంలో ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎందుకంటే ప్రతి పదిమందిలోనూ మధుమేహం ఆరుగురికి మధుమేహం వారి జీవనశైలి కారణంగా వస్తూ ఉంటే,మరో ఒకరికి వారి వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది.ఇలా వంశపారంపర్యంగా వచ్చే మధుమేహాన్ని ఎలాగూ రాకుండా కంట్రోల్ చేయలేము.కానీ మన జీవన విధానం వల్ల వచ్చే మధుమేహం నుంచి మాత్రం,కొన్ని మసాలా దినుసులు ఈజీగా దూరం చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.ఆ మసాలా దినుసులను మనం తరుచు తీసుకోవడం వల్ల,మధుమేహం దూరం చేయడమే కాకుండా రకరకాల రోగాలను కూడా దరిచేరకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు అని కూడా సూచిస్తూ ఉన్నారు.మరి ఆ మసాలా దినుసులు ఏంటో తెలుసుకుందాం పదండి..

దాల్చిన చెక్క..

ఈ దాల్చిన చెక్కను అన్ని రకాల మసాలా కూరల్లోను, రైస్లలో వాడుతుంటాము.ఈ దాల్చిన చెక్క పొడిని టీ స్ఫూన్ మొతాదులో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మన శరీరంలోని హార్మోన్స్ ఇన్ బాలన్స్  గురి కాకుండా ఉంటాయి.ఇది ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది.ఇది రక్తంలో చక్కెరను కణాలలోకి తరలించే ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.దీనితో మధుమేహం దరిచేరకుండా ఉంటుంది.

పసుపు..

పసుపులో కర్కుమిన్ అనే చురుకైన,అద్భుతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉంది.ఈ కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు,మధుమేహానికి సంబంధించిన ఇతర సమస్యలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

లవంగాలు..

లవంగాలను రోజుకు మూడు నుంచి ఐదు వరకు తీసుకోవడం వల్ల మన రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా దోహదపడుతుంది. దీనితో మధుమేహం దరి చేరకుండా ఉండడమే కాకుండా మన నోటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

మెంతులు..

మెంతులు షుగర్ కి అసలైన ఔషధంగా పనిచేస్తుంది. మెంతులను రోజు నానబెట్టుకుని తీసుకోవడం వల్ల,మన రక్తంలోని చక్కెర లెవల్సింది పెరగకుండా చేయడంతో మధుమేహం దరి చెరనివ్వదు.

ధనియాలు..

రోజుకో ఒక స్ఫూన్ వేయించిన ధనియాలు తీసుకోవడం వల్ల,పొట్ట సమస్యలు తగ్గడమే కాకుండా,ప్యాంక్రియాజ్ నుంచి నుంచి రిలీజ్ అయ్యే ఇన్సులిన్  కంట్రోల్ లో ఉంచుతాయి.దీనితో మధుమేహ దరి చేరకుండా ఉంటుంది.కావున కూడా మధుమేహానికి గురికాకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఈ మసాలా దినుసులను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: