
దీని వలన టైప్ 2 మధుమేహం ఉన్నవారికి రక్తంలోని గ్లూకోజ్ తక్కువ స్థాయిలో ఉంటుంది. కాకరకాయ రసంలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహ రోగులు తరచూ ఇన్‌ఫెక్షన్లకు గురికావటం వల్ల, వ్యాధినిరోధకత పెరగడం ఎంతో అవసరం. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెడతాయి. మధుమేహంతో పాటు హృదయ సంబంధిత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
కాకరకాయ జ్యూస్ తక్కువ క్యాలరీలతో ఉండటం వలన శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి అధిక బరువు ప్రమాదకరమైనదే. కాకరకాయ రసం మెటాబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. కాకరకాయ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కాలేయ సంబంధిత సమస్యలకు గురికావచ్చు, అటువంటి వారికి ఇది సహాయకారిగా ఉంటుంది. పుష్కలంగా ఉండటంతో కాకరకాయ జ్యూస్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా కీలక పాత్ర వహిస్తుంది. ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో 50ml – 100ml కాకరకాయ జ్యూస్ తీసుకోవాలి. జ్యూస్ తాగిన తర్వాత కనీసం అరగంట గ్యాప్ తీసుకుని ఆహారం తీసుకోవాలి.