
వేసవి కురుపులు లేదా వేసవికాలంలో ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా చమట ఎక్కువగా వచ్చే చోట మొహం, మెడ, చాతి మొదలైన భాగంలో వస్తూ ఉంటాయి. ఇది ఎర్రగా ఉండి చర్మాన్ని మురికి చేయడమే కాకుండా మంట, జలుబు వంటి ఇబ్బందులు కలిగిస్తాయి. ముల్తాని మట్టి నీరు కలిపి ముఖానికి అప్లై చేయండి. ఇలా చర్మం లోని వేడిని తగ్గేలా చేస్తాయి. తాజా అలోవెరా జెల్ ను నేరుగా కురుపుల పై అప్లై చేయడం మంచిది. ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు కలిగి ఉంటుంది. పుదీనా ఆకులను గుజ్జుగా చేసి అప్లై చేయండి. చర్మానికి చల్లదనం ఇస్తుంది. వేడి తగ్గించడంలో హైడ్రేషన్ చాలా కీలకం. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగండి. బాత్ వాటర్ లో ఓట్స్ పొడి వేసి స్నానం చేయండి. చర్మాన్ని శాంతి పరచడంలో సహాయపడుతుంది.
పొడిగా ఉంచే ప్రయత్నం చేయండి ఎక్కువగా ఉంటే కురుపులు ఎక్కువ అవుతాయి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి , వేడి నీరు వల్ల మరింత మంట ఏర్పడవచ్చు. తులసి ఆకుల్ని నూరి ఆ పేస్టును కురుపుల పై పెట్టండి. తులసిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కురుపులు తగ్గించడంలో ప్రభావవంతమైగా పనిచేస్తాయి. ఉల్లిపాయ ముక్కలను కురుపుల పై పెట్టి కాసేపు అలా వదిలేస్తే వేడి తగ్గి, సమస్య తొలగిపోతుంది. ఈజీగా వేడి కురుపుల్ని తొలగించుకోవచ్చు. వేడి వల్ల వచ్చిన కురుపుల పై తేనెను అప్లై చేస్తే సులువుగా కురుపులు తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్స్ కూడా ఇది తగ్గిస్తుంది. వేపాకుల్ని నూరి ఆ పేస్టు గ్రూపులపై వాడితే సులువుగా సమస్య పోతుంది. ఇందులో ఉండే ఆంటీ సెప్టిక్ గుణాలు ఔషధం మాదిరిగా పనిచేస్తాయి.