- ( లైఫ్ స్టైల్ - ఇండియా హెరాల్డ్ )

మానవ జీవితం ప్రస్తుతం ఉరుకు పరుగులు జీవితం అయిపోయింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సుఖవంతమైన జీవనానికి అలవాటు పడిపోతున్నారు. మనిషికి వ్యాయామం తగ్గిపోతుంది. అయితే ప్రతి మనిషికి నడక చాలా సులభమైన వ్యాయామం అని చాలా పరిశోధనలు ఇప్పటికే రుజువు చేశాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పరిశోధకులు నడక ప్రాముఖ్యతను వివరించే పరిశోధన వివరాలు ప్రకటించారు. దీని ప్రకారం ప్రతిరోజు పదివేల అడుగులు వేసే వారికి చాలా క్యాన్సర్లు రావని చెపుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా 10,000 అడుగుల దూరం నడిస్తే దాదాపు 13 రకాల క్యాన్సర్లు దూరం అవుతాయని వారు చెబుతున్నారు. ఏకంగా 85 వేల మంది మీద ఈ పరిశోధన జరిగింది. అది కూడా ఆరు సంవత్సరాల పాటు వారు యాక్టివిటీస్ . . . నడక బాడీలో మార్పులు అన్నీ పరిశీలించి ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించారు.


ప్రధానంగా లివర్ - లంగ్ - కిడ్నీ - గ్యాస్ట్రిక్ ఎండోమెటీరియల్ - కాల‌న్ - హెడ్ - నెక్ - బ్లాడర్ వంటి క్యాన్సర్లు నడక నియంత్రిస్తుందని ఈ పరిశోధన చెపుతుంది. కనీసం ఐదువేల అడుగులతో కూడా మంచి ప్రయోజనాలు వస్తాయని ఈ అధ్యయనం చెప్పింది. ఎక్కువ సమయం కూర్చోవడం లేదా కూర్చుని పనిచేసే వాళ్ళలో తలెత్తే క్యాన్సర్ ప్రమాద‌ కారాకాల నుంచి నడక పూర్తి రక్షణగా నిలుస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. రోజుకు కనీసం 6000 అడుగులు అయినా నడవాలని ఇదివరకే చాలా అధ్యయనాలు చెప్పాయి. గ్యాస్టిక్ ట్రబుల్ బాడీ క్యాట్ వంటి వాటిని తగ్గించుకోవటానికి నడక మంచి పరిష్కార మార్గంగా వైద్యులు ఇప్పటికే చెప్పారు. ఇలా నడకను రోజువారీ తప్పనిసరిగా అలవాటు చేసుకుంటే అది అత్యుత్తమమైన వ్యాయమంగా నిలుస్తుందని తాజా పరిశోధన మరోసారి స్పష్టం చేసింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: