మన భారతీయ సంస్కృతిలో, తులసి మొక్క కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు. అది ఒక పవిత్రమైన దేవతగా, ఇంటికి శ్రీరామరక్షగా భావిస్తారు. దాదాపు ప్రతి హిందువు ఇంటి ముందు ఉండే ఈ తులసి మొక్క, ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఎన్నో ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుందని నమ్ముతారు.

తులసి మొక్క ఇంట్లో ఉంటే చెడు దృష్టి, నెగటివ్ శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. తులసి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. తేనెతో కలిపి తులసి ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తులసిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు.

తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం తులసి టీ తాగడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. తులసి ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, ఇతర చర్మ సమస్యలను నివారిస్తాయి. తులసి పేస్ట్‌ని ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ప్రయోజనకరం. తులసి మొక్క గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్‌ని గ్రహించి, ఆక్సిజన్‌ని విడుదల చేస్తుంది. ఇది ఇంటి చుట్టూ ఉన్న గాలిని శుద్ధి చేసి, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది తులసి ఆకుల్లో ఉండే ఘాటైన వాసన దోమలను, ఇతర కీటకాలను ఇంటి నుంచి దూరం చేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: