పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం...టీడీపీ అధికారంలో ఉన్నని రోజులు బాగా హైలైట్ అయిన పేరు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ వివాదాల్లో ఎక్కువగా ఉండేవారు. ఆ ఐదేళ్లు అనేక వివాదాల్లో చింతమనేని చిక్కుకున్నారు. ఇక వాటినే అస్త్రాలుగా చేసుకుని వైసీపీ, టీడీపీపై విమర్శలు చేసేది. అయితే ప్రభాకర్‌కు చుట్టూ వివాదాలు ఎక్కువగానే ఉన్నా, నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండటంలో ముందే ఉండేవారు.


కానీ వివాదాల ఎక్కువ అవ్వడం వల్ల 2019 ఎన్నికల్లో ప్రభాకర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఊహించని విధంగా జగన్ వేవ్‌లో కొఠారు అబ్బయ్య చౌదరీ వైసీపీ తరుపున విజయం సాధించారు. ఇక అబ్బయ్య ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి, రెండేళ్ళు అవుతుంది. మరి ఈ రెండేళ్లలో అబ్బయ్య పనితీరు ఎలా ఉందనే విషయం ఒక్కసారి పరిశీలిస్తే, ఈయన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నారు.


అలాగే ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా అందిస్తున్నారు. అటు పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ పనులు చేసి పెడుతున్నారు. కాకపోతే రెండేళ్లలో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి ఏం జరగలేదని అంటున్నారు. గతంలో చింతమనేని ఎక్కువగా అభివృద్ధి చేశారనే టాక్ వినిపిస్తోంది. ఆయనకు వివాదాలు ఒక్కటే మైనస్ అయింది గానీ, లేదంటే ప్రభాకర్‌కు దెందులూరులో తిరుగులేదని అంటున్నారు.


ఇప్పటికే ప్రభాకర్ పుంజుకున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయారు. కరోనా సమయంలో సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి ప్రజలకు సాయం చేస్తున్నారు. పంచాయితీ ఎన్నికల్లో కూడా కాస్త గట్టి పోటీనే ఇచ్చారు. కాబట్టి ఆయన్ని నెక్స్ట్ ఎన్నికల్లో ఢీకొట్టాలంటే  అబ్బయ్య ఇంకా స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరముంది. రానున్న మూడేళ్లలో ప్రజలకు మరింత చేరువ కావాలి. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఎలాగో ప్లస్ అవుతాయి. అలా అని కేవలం జగన్ ఇమేజ్ మీద ఆధారపడకూడదు. సొంతంగా మరింత బలం పెంచుకోవాలి. ఎందుకంటే అపోజిట్ చింతమనేని ఉన్నారు. కాబట్టి చింతమనేనితో అబ్బయ్య కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: