రామజోగయ్య శాస్త్రి.. గుర్తుండిపోయే పాటలు రాసే రామజోగయ్య శాస్త్రి ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేస్తున్నారు. తన సాహిత్యాన్ని అభిమానులతో పంచుకునేందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంచారు. తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తూ.. మొదటి వీడియో పోస్టు చేశారు. తన సాహిత్యాభిమానులతో ఇంటరాక్ట్ కావడానికే ఈ ఛానల్ పెడుతున్నానని తన మొదటి వీడియోలో రామజోగయ్య శాస్త్రి తెలిపారు.




ఈ వీడియో లింక్‌ను సినీ నిర్మాత, పీఆర్వో బీఏ రాజు ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ప్రణామం ప్రణామం అంటూ పండగలా దిగివచ్చి యూ ట్యూబ్ ఛానెల్ పెట్టాడయ్యో సామీ.. అంటూ కామెంట్ చేశారు.


రాజు ట్వీట్ కు రామజోగయ్య శాస్త్రి స్పందిస్తూ.. ధ్యాంక్యూ రాజుగారూ.. నామీద పాటే రాసేశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు.


దీనికి మళ్లీ రాజు స్పందించారు. రాంజో గారూ, ఆ పాటలు రాసింది మీరే నేను కలిపాను అంతే.. అంటూ వినయంగా స్పందించారు.



ఇక రామజోగయ్యశాస్త్రి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన ఓ తెలుగు సాహిత్య  స‌ముద్రం..! ఆయ‌న క‌లం నుంచి జాలువారిన పాట‌లెన్నో..  ఏ దిక్కున నీవున్న ఎగిరొస్తా పావురమా.. నా రెక్కల కలనాపే బలమేది లేదు సుమా అంటూ 2004లో వచ్చిన యువసేన చిత్రంలో తొలిపాట రాసారు శాస్త్రి. చదివింది ఇంజినీరింగ్ అయినా సాహిత్యంపైనే మక్కువ ఎక్కువ ఆయనకు.. పాటగాడు కావాలనుకంటూ ఇండస్ట్రీకి గీతరచయితగా పేరు తెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: