బాలీవుడ్ షెహన్షా అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 79 సోమవారం తన 79 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్య జయతో ఆయన ప్రేమ కథ ఎలా మొదలైందో తెలుసుకుందాం.

అమితాబ్ బచ్చన్ 'బాలీవుడ్ షహెన్షా' అయి ఉండొచ్చు. కానీ అది ఆయన నటి జయ భదూరిని కలిసిన సమయంలో కాదు. జయా, అమితాబ్ కలిసేటప్పటికే ఆమె సక్సెస్ ఫుల్ హీరోయిన్. అమితాబ్ మాత్రం ఇంకా కెరీర్‌ ప్రారంభ దశలోనే ఉన్నారు. అమితాబ్ తొలిసారిగా 'గుడ్డి' సెట్‌లో జయను కలిశారు. వారి మధ్య వెంటనే ఆ స్పార్క్ ఏర్పడింది. చివరికి వారు ప్రేమలో పడ్డారు. అమితాబ్ తన కెరీర్‌ను స్ట్రాంగ్ చేసుకోవడానికి అప్పటికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ఆ తరువాత జయ సరసన 'జంజీర్' చిత్రానికి సంతకం చేశాడు. ఈ సినిమా కోసం అతడిని సిఫార్సు చేసింది జయ అని చాలామంది నమ్ముతారు. ఈ చిత్రం మే 11, 1973 న విడుదలైంది. ఇది భారీ విజయాన్ని సాధించింది. అమితాబ్‌ను యాంగ్రీ యంగ్ మెన్ గా స్వీకరించారు ప్రజలు. సినిమా విజయం తర్వాత మొదటిసారి ఈ జంట కలిసి లండన్ సందర్శించాలని నిర్ణయించుకున్నారు. వారి లండన్ పర్యటన గురించి తెలియజేయడానికి అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ వద్దకు వెళ్లారు.

ఈ విషయాన్నీ స్వయంగా అమితాబ్ ఇటీవల సోషల్ మీడియాలో పంచుకున్నాడు ''జంజీర్ సినిమా విజయంసాధిస్తే, మేము కొంత మంది స్నేహితులతో కలిసి మొదటిసారి లండన్ వెళ్లాలని అనుకున్నాము. అదే విషయాన్నీ నా తండ్రితో చెప్పగా ఎవరెవరు వెళ్తున్నారని నా తండ్రి అడిగాడు? నేను అందరి పేర్లు చెప్పాను. అయితే మీరు వెళ్లే ముందు ఆమెను తప్పక పెళ్లి చేసుకోవాలని అనుకుంటే వెళ్ళు. లేకపోతే నువ్వు వెళ్లవద్దు అని అన్నారు. నేను అదే పాటించాను '' అని చెప్పుకొచ్చారు. అమితాబ్, జయలకు ఆ సమయంలో ఇంకా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఆయన తండ్రి ఆదేశించినప్పుడు వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ జంట జూన్ 3, 1973 న వివాహం చేసుకున్నారు. అలా జయ బచ్చన్ అయ్యారు. ఇది జరిగి 48 సంవత్సరాలు గడిచింది. ఈ జంట ఇప్పటికీ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పంచుకుంటూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: