ఆకట్టుకునే అందం అలాగే అద్భుతమైన నటన.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా స్టార్ హీరోగా పేరు పొందింది సొట్టబుగ్గల సుందరి అయిన శ్రీయ శరణ్. చిన్న సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుందని అందరికి తెలుసు.అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తుంది.

తెలుగులోనే కాదు వేరే భాషల్లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది . ఇక, కొన్నేళ్ల క్రితమే ఈ బ్యూటీ వివాహం చేసుకుందని అప్పటి నుంచి సినిమాల్లో పెద్దగా కనిపించడం మానేసింది.. కానీ, సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన భర్తతో రొమాన్స్ చేస్తోన్న ఓ ఫొటోను పోస్ట్ చేసింది. 

శ్రీయ శరణ్ ఆరంభంలో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందట.అందులో తనదైన శైలి గ్లామర్ ట్రీట్‌తో సత్తా చాటుతోన్న సమయంలో పలు రకాల యాడ్స్ చేయడంతో పాటు కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గా కూడా చేసింది. ఈ క్రమంలోనే 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైందట. తర్వాత 'సంతోషం'తో మొదటి హిట్‌ను అందుకుంది. అప్పటి నుంచి ఆమె పాపులర్ అయింది.

హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించిన తొలినాళ్లలోనే సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో నమోదు చేసుకున్న శ్రీయ శరణ్.. లక్కీ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె ఏకంగా ఏడాదికి పది సినిమాలు చేస్తూ తన హవాను చూపించింది. ఫలితంగా టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆమె పేరు పొందింది.అంతేకాదు రెమ్యూనరేషన్ కూడా భారీగా తీసుకొని రికార్డులకెక్కింది.

శ్రీయ శరణ్ టాలీవుడ్‌లో ఎంతో కాలం పాటు స్టార్‌డమ్‌ను అనుభవిస్తూ ప్రయాణాన్ని కొనసాగించిన ఈ క్రమంలోనే సీనియర్లు మరియు జూనియర్లు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసింది. అదే సమయంలో తెలుగులో దాదాపు అందరు హీరోలతోనూ నటించింది.తద్వారా ఎన్నో రికార్డులు మరియు అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత మిగిలిన భాషల్లోనూ కూడా అడుగు పెట్టింది.

కెరీర్ ఆరంభం నుంచి వరుస ఆఫర్లతో రెచ్చిపోయిన శ్రీయ శరణ్.. ఆండ్రీ అనే వ్యాపారవేత్తతో ఆమె ప్రేమాయణం సాగించిందట. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి తర్వాత 2018లో వివాహం చేసుకుంది. ఇక, తన భర్తతో తరచూ టూర్లు వెళ్తూ రచ్చ రచ్చ చేస్తోందట ఈ హాట్ బ్యూటీ. ఇక, తాను ఓ బిడ్డకు తల్లినయ్యానని ఇటీవలే ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసిందట.


శ్రీయ శరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తోన్న rrr మూవీలో ముఖ్య పాత్రను పోషించింది. అలాగే, 'గమనం' అనే మరో సినిమాలో కూడా నటించింది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలను కూడా చేసింది. ఇవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. ఇదిలా ఉండగా శ్రీయ శరణ్ ప్రస్తుతం ముంబైకి మకాం మార్చేసినట్లు సమాచారం.ఇటీవలే భర్తతో కలిసి ఆ మహానగరంలో గృహప్రవేశం కూడా చేసిందట..

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్నా కూడా శ్రీయ శరణ్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోందట.ఇందులో భాగంగానే తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది ఈ భామ. తన అందచందాలను చూపిస్తూ ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోందట..

శ్రీయ శరణ్ తన భర్త అండ్రీతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన భర్తతో స్విమ్మింగ్ పూల్‌లో రొమాన్స్ చేస్తున్న ఓ పిక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిందట.ఇందులో శ్రీయ శరణ్‌ను ఆమె భర్త ఆండ్రీ లిప్ కిస్ చేసుకుంటూ కనిపించారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అయిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: