హీరోయిన్ నజ్రియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఫాహద్ ఫాజిల్ భార్య గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే హీరోయిన్ గా 2014 లో కోన్ని సినిమాలు చేసింది మళ్ళీ ఆ తర్వాత 2018 వరకు కనిపించలేదు. అప్పుడు ఒక సినిమా చేసింది ఆ తర్వాత మళ్లీ 2020 వ సంవత్సరం వరకు కనిపించలేదు. మళ్లీ రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా 2022 లో సినిమాలు చేస్తోంది నజ్రియా. అయితే ఇలా గ్యాప్ తీసుకొని ఏం చేస్తోంది అనే విషయం ఇపుడు హాట్ టాపిక్గా మారింది వాటి గురించి చూద్దాం.

ఒక సినిమా అయిన తర్వాత బ్రేక్ తీసుకోవాలిని ఏ హీరోయిన్ అయినా అనుకుంటారు.. అయితే ఇప్పుడు నజ్రియా అలా ఎందుకు చేసింది అనే విషయంపై మాట్లాడుతూ.. ఒక సినిమా అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట. అలా కాస్త రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని తెలిపింది. కొంత మంది వచ్చి పచ్చి స్క్రిప్టులు చెబుతూ ఉంటారు ఆ టైంలో నేను సినిమాలు చేసే మూడు లోనే ఉండను.. కొన్నిసార్లు ట్రావెలింగ్ లో ఉంటాను ,పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అందుచేత తక్కువగా సినిమాలు చేస్తూ ఉంటానని తెలియజేసింది.


ఇలా తన కెరియర్ గ్యాస్ పై స్పందించిన నజ్రియా స్క్రిప్టు ఎంపిక విషయంలో తను చాలా సెలెక్టివ్ గా ఉంటానని అందుచేతనే చాలా తక్కువ మంది కథలను మాత్రమే వింటానని తెలియజేసింది. అందుచేత తన కెరియర్ ఇలా గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. గతంలో నజ్రియా కం బ్యాక్ మూవీ విడుదల అవుతోంది అని ఎంతో గొప్పగా చెప్పేవారు కానీ ఈ మధ్య కాలంలో ఈ విషయం చాలా లైట్గా తీసుకుంటున్నారు అని తెలియజేసింది. ఇక ఇలా ఎంత గ్యాప్ తీసుకున్నా కూడా తనని ఇష్టపడే వారు ఇంకా ఉండడం తన అదృష్టమని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: