ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో  ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో అయితే అసెంబ్లీ ఎన్నికలవేడి తగ్గక ముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో.. ఎన్నికల పోరు మరింత రసవతరంగా మారిపోయింది. ఇక ఈసారి మెజారిటీ స్థానాలలో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే గెలుపు గుర్రాలను బరిలోకి దించిన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.


 ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో విరుచుకుపడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ కూడా ఇతర పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు సంచలనంగా మారిపోతున్నాయ్. అయితే ఈ విమర్శలు నిజమా అబద్దమా అనేది పక్కన పెడితే.. ఇక తెలంగాణ రాజకీయాలను మాత్రం ఇలాంటి విమర్శలు ఊపేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కాంగ్రెస్ నుంచి సీఎం గా ఉన్న రేవంత్ మరికొన్ని రోజుల్లో బిజెపిలోకి వెళ్ళబోతున్నాడని బిఆర్ఎస్ అంటుంటే బిఆర్ఎస్,  బిజెపి ఒకటి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది.


 బిఆర్ఎస్ కాంగ్రెస్ లు కలిసి నాటకాలు ఆడుతున్నాయని బిజెపి ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. ఇలా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నారు. కాగా ఇటీవల బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. గత కొంతకాలం నుంచి హరీష్ రావు సీఎం రేవంత్ మధ్య తీవ్ర విమర్శలు కొనసాగుతున్నాయ్. అయితే మీడియా దృష్టి మళ్లించడం కోసమే మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారని మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. నిజాంపేట మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో హరీష్ రావు కొత్త పార్టీ పెట్టిన పెట్టొచ్చు కేసీఆర్, కేటీఆర్ హైలెట్ కాకుండా హరీష్ రావు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. అయితే ఇది కేటీఆర్ గమనించడం లేదు అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అయితే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అంటూ రఘునందన్ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారి తీసాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr