అలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన రమ్య కృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . రమ్య కృష్ణ అలనాటి కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నటసింహం బాలకృష్ణ , టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోల సరసన అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి రమ్య  కృష్ణ  ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  అనేక మూవీ లలో ముఖ్య మైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది . 

అందులో భాగంగా తాజాగా రమ్య కృష్ణ , విజయ్ దేవరకొండ హీరో గా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో తెరకెక్కిన లైగర్ మూవీ లో విజయ్ దేవరకొండ కు తల్లి పాత్రలో నటించిం ది. ఈ మూవీ ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతుంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా బాలీవుడ్ మీడియా తో మాట్లాడిన రమ్యకృష్ణ , షారుక్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.  తాజాగా రమ్యకృష్ణ బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ... బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సంస్కారం తెలిసిన వ్యక్తి అని , చుట్టూ ఉన్న వారిని తన ప్రవర్తనతో  షారుఖ్ ఖాన్ ఆకట్టుకుంటాడు అని ,  షారుక్ ఖాన్ ఒక స్వీట్ హార్ట్ అని రమ్యకృష్ణ చెప్పింది. అలాగే 1996 లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఛాహత్ లో తాను విలన్ గా నటించినట్లు రమ్యకృష్ణ గుర్తుచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: