అక్టోబర్ 10తో త్రివిక్రమ్ మొదటి సినిమా నువ్వే నువ్వే విడుదలై 20 సంవత్సరాలు అయిపోయింది. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకొని విధంగా పారితోషికంతో పాటు మార్కెట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు త్రివిక్రమ్. పోస్టర్ మీద పేరు కనిపిస్తే కలెక్షన్ల వర్షం కురిసే సత్తా ఉన్న దర్శకుడు ఈ మాటల మాంత్రికుడు. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు దాటిపోయింది.. కానీ దర్శకుడిగా మారి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

అక్టోబర్ 10తో ఈయన మొదటి సినిమా నువ్వే నువ్వే విడుదలై 20 సంవత్సరాలు అయిపోయింది. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా 20 సంవత్సరాల వేడుకలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీడియాకు వెల్లడించాడు త్రివిక్రమ్.

ఇప్పుడంటే ఇంకా సైలెంట్ గా ఉన్నాను కానీ ఒకప్పుడు తనకు చాలా కోపం ఉండేదని.. లొకేషన్ లో ఎవరి మీద పడితే వాళ్ల మీద అరిచే వాడినని.. మైకులు విరగ్గొట్టే వాడినని నన్ను ఇంతగా భరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడంటే వయసు మీద పడింది కాబట్టి.. కాస్త అనుభవం వచ్చి సైలెంట్ గా ఉన్నాను కానీ అప్పట్లో మాత్రం జిమ్మీ అసిస్టెంట్ల వెనక కొట్టడానికి పరిగెత్తే వాడిని అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు త్రివిక్రమ్. తాను అనుకున్నట్టుగా డైలాగు గాని సీన్ గాని రాకపోతే చాలా ఫ్రెష్టేట్ అయ్యే వాడినని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఒకప్పుడు సిగరెట్లు ఎక్కువగా కాల్చే వాడిని.. మందు కూడా తాగే వాడిని అంటూ తన సీక్రెట్స్ అన్ని బయట పెట్టాడు. ఇవన్నీ ఇలా చెప్తూనే.. నిర్మాత స్రవంతి రవికిషోర్, నటుడు ప్రకాష్ రాజ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని ఎంతో ఎమోషనల్ గా చెప్పుకున్నాడు త్రివిక్రమ్. తనకంటూ ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లోనే వీళ్లు తనలో ఒక అద్భుతమైన టెక్నీషియన్ ను చూశారు అంటూ ఎమోషనల్ అయ్యాడు.

ప్రకాష్ రాజ్ ఇంటికి వెళ్లి ఆయన వాచీలు లాక్కోవడం.. అక్కడ ఏం దొరికితే అది తినడం మందు బాటిల్స్ ఎత్తుకొని రావడం ఇలాంటి సంఘటనలు కూడా గుర్తు చేసుకున్నాడు. ఇవి మాత్రమే కాదు అప్పట్లో చాలా దౌర్జన్యాలు చేశామంటూ త్రివిక్రమ్ చేసిన కామెంట్స్ అందరికీ నవ్వు తెప్పించాయి. చాలా రోజుల తర్వాత నువ్వే నువ్వే 20 సంవత్సరాల వేడుకలు త్రివిక్రమ్ మాట్లాడిన స్పీచ్ వైరల్ అవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: