ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వరుసగా వచ్చాయి.
ఆ తర్వాత ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్,బంగార్రాజు వంటి రెండు సినిమాలు కూడా హిట్టవడంతో ఈమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. కృతి మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ల లిస్ట్ కి వెళ్ళిపోయింది. కానీ నిజానికి కృతి శెట్టి చిన్నప్పట్నుంచి హీరోయిన్ అవ్వాలని కలగనలేదట. కృతి ముంబైలో చదువుకుంటున్న టైంలోనే కమర్షియల్ యాడ్స్ లో అప్పుడప్పుడు కనిపించేదట.

ఇక ఆ తరువాత ఆమెకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ముందుగా ఆమె హిందీ లో సూపర్ 30 లో స్టూడెంట్ గా నటించింది. ఆ తర్వాత మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవడంలో తన ఫ్యామిలీ చాలా త్యాగం చేసిందనే వార్తలు ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నాయి. కృతి శెట్టి 2003 ముంబై లో పుట్టింది. కృతి శెట్టి కర్ణాటకలోని మంగళూరు తుళు ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. కృతి శెట్టి తండ్రి బిజినెస్ లో సెటిల్ అయ్యి ముంబై కి వచ్చాడు. కృతి శెట్టి తల్లి ఫ్యాషన్ డిజైనర్.

ఈమెకు ఒక తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. ఇక ముంబై లోనే పుట్టి పెరిగిన కృతి శెట్టి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఇక సినిమాల్లో కృతి శెట్టి కి వరుసగా ఛాన్సులు రావడంతో కృతి శెట్టి తల్లి తన బిడ్డకోసం ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసిందట. ఎందుకంటే కృతి శెట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటే తన తల్లి కూడా వస్తుంది. అలా బిడ్డ కోసం తన కెరీర్ ని సైతం పక్కన పెట్టి కృతి ని హీరోయిన్ గా చేసింది అంటూ కృతి శెట్టి ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఆడియో ఫంక్షన్ లో చెప్పుకొచ్చింది. ఇక కృతి శెట్టి తల్లి చేసిన త్యాగం తెల్సిన చాలామంది నువ్వు గ్రేట్ తల్లివి అంటూ పొగుడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: