తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే పేపర్ బాయ్ ,  ఏక్ మినీ కథ ,  మంచి రోజులు వచ్చాయి మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా సంతోష్ శోభన్ ,  మారుతీ దర్శకత్వంలో మెహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే సంతోష్ శోభన్ తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీcలో ఫరీయా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ,  మేర్లపాక గాంధీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

మూవీ ని నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను చేసింది. అలాగే ఈ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ... ఎక్కడ ... ఏ సమయానికి జరగబోతుంది అనే విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది. తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రయిబ్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ది వెస్టిన్ , హైదరాబాద్ లో జరగనున్నట్లు ,  అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: