
ఇదిలా ఉండగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ రెండవ భార్య అయిన రేణు దేశాయ్ కూడా గత కొంతకాలంగా తాను గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను గత కొంతకాలంగా గుండె సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నాను అని తనకు ఎవరైనా హెల్ప్ ఫుల్ గా ఉంటే చాలా బాగుంటుంది అంటూ ఆమె చెప్పుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలా రేణు దేశాయ్ అనారోగ్య బారిన పడిందని తెలిసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇటు రేణూ దేశాయ్ అభిమానులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలని కూడా కోరుకుంటున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ప్రభాస్ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు అంటూ మొన్నటి వరకు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే కానీ ఇప్పుడు ఆ వార్తలపై ఎటువంటి నిజం లేకపోయింది. కొంతమంది కావాలని ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేశారు అని ఆయన ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం . కానీ జ్వరం కారణంగా సినిమా షూటింగ్లకు వెళ్లలేకపోయారని నీరసం రావడంతో వైద్యులు రెస్టు తీసుకోమని చెప్పినట్లు సమాచారం . ఏది ఏమైనా అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.