
పార్ట్ 3 లో గ్రూప్ సబ్జెక్టులు ఉండేవి ముఖ్యంగా ఎంపీసీ గ్రూపు అయితే.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉండేవి.. గణితం, రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం తెలుగు ఇంగ్లీష్ చదువుతోపాటు ఆరో సబ్జెక్టు కింద జీవశాస్త్రం తీసుకుంటే అందులో జీవశాస్త్రం కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉండదట.. ఒకవేళ ఆరవ సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఐదు సభ్యత్వంలో పాసైన మెమోని మాత్రమే ఇస్తారు.. ఒకవేళ ఆరవ సబ్జెక్టులో కూడా పాస్ అయితే ఒక ప్రత్యేక మెమో అని కూడా జారీ చేస్తారట
అయితే పార్ట్ 2 లో తెలుగు సంస్కృతం, అరబిక్ వంటి భాషలతో గ్రూప్ ఆప్షన్లను సైతం మొత్తం మీద 24 వరకు సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ఏ సబ్జెక్ట్ అయినా సరే విద్యార్థి ఎంచుకోవచ్చట. 24 సబ్జెక్టులలో ఎంపీసీ విద్యార్థి ఐదు సబ్జెక్టులు (గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఆంగ్ల భాష, జీవశాస్త్రం) ఈ ఐదు సబ్జెక్టులు ఎంచుకుంటే 5 ఖచ్చితంగా పాసు కావాలి. వీరు జేఈఈ తో పాటుగా నీటి పరీక్ష కూడా రాయవచ్చట.
గతంలో లాగా ఎంపీసీ, బైపిసి, హెచ్ఈసి, సీఈసీ గ్రూపులలో పార్ట్2 లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులను చదువుకునే అవకాశం విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.