మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట తో ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండడమే కాకుండా పలువురు హీరోయిన్స్ ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావు పూడితో ఒక క్రేజీ ప్రాజెక్టుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి  పనులు చక్క చక్క జరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ కాకముందే ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేశారు డైరెక్టర్ అనిల్ రావుపూడి. అయితే ఈసారి కాస్త విభిన్నంగా కూడా ఆలోచిస్తున్నారు.



చిరంజీవి పాత్రను ప్రేక్షకులను మరింత కవ్వించే విధంగా ఉండబోతుందట. కామెడీ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఉండడమే కాకుండా ఈ చిత్రంలో విలన్ గా కూడా ఒక ప్రత్యేకమైన పాత్రను చిత్రీకరించబోతున్నారని టాప్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరంజీవిని ఢీ కొట్టే విలన్ పాత్రలో యంగ్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఆ హీరో ఎవరో కాదు RX -100 హీరో కార్తికేయ. దీనిపైన ఇంకా సరైన క్లారిటీ అయితే రాలేదు కానీ ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతున్నది. చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని కూడా ఎన్నో సందర్భాలలో కార్తికేయ తెలియజేశారు. అంతేకాకుండా కార్తికేయ పెళ్లిలో కూడా చిరంజీవి కనిపించడం అందరికీ తెలిసిందే..



ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోగా మారిన కార్తికేయ తన మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత పలు చిత్రాలలో నటించిన కార్తికేయ గ్యాంగ్ లీడర్ చిత్రంలో  కూడా విలన్ గా కనిపించారు. అలాగే హీరో అజిత్ నటించిన తెగింపు సినిమాలో కూడా విలన్ గానే కనిపించారు. ఇప్పుడు మరొకసారి చిరంజీవి సినిమా కోసం విలన్ గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇవన్నీ కూడా కుదిరింటే డైరెక్టర్ అనిల్ రావు పూడి వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: