
టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్లు సినిమాకు పెరుగుతూ పోతున్నాయి. ఒకప్పుడు 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే బాలయ్య రెమ్యూనరేషన్ ఇప్పుడు 30 కోట్లు దాటింది. ఇక మెగాస్టార్ చిరంజీవి రెమ్యూనరేషన్ నిన్న మొన్నటివరకు 60 నుంచి 65 కోట్ల రేషియోలో ఉండేది .. తాజాగా అనిల్ రావిపూడి సినిమాకు ఆయన ఏకంగా 75 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ధనుష్ 50 కోట్లు .. శివ కార్తికేయను 30 కోట్లు .. నాని రెమ్యునరేషన్ 30 కోట్లు .. మాస్ మహారాజు రవితేజ 25 కోట్లు .. సిద్దు జొన్నలగడ్డ 15 కోట్లు ... విశ్వక్సేన్ 6 కోట్లు ...శ్రీ విష్ణు ఐదు కోట్లు ... శర్వానంద్ 10 కోట్లు ... నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజా సినిమాకు తీసుకుంది 8 కోట్లు అన్న చర్చలు ఉన్నాయి. ఇక సందీప్ కృష్ణ కూడా మూడు కోట్లు తీసుకుంటున్నారట. ఇలా ప్రతి ఒక్కరి మినిమం రెమ్యునరేషన్ రెండు నుంచి మూడు కోట్ల వరకు కనిపిస్తోంది.
ఇక దర్శకులు కూడా అలాగే కనిపిస్తున్నారు. టాప్ లైన్ డైరెక్టర్ల సంగతి పక్కన పెడితే యంగ్ డైరెక్టర్లు అంతా 15 నుంచి 25 కోట్లు తీసుకుంటున్నారట. బాబి - గోపీచంద్ మలినేని 15 కోట్లకు దగ్గరలో ఉన్నారు. అనిల్ రావిపూడి 25 కోట్లు తీసుకుంటున్నారు. చందు మొండేటి 10 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. ఒక సినిమా హిట్టు కొడితే మూడు కోట్లు .. రెండు సినిమాలు వరుసగా హిట్ కొడితే 5 కోట్లు .. మూడు వరుస హిట్లు ఉంటే పది కోట్లు ఇక అక్కడ నుంచి పెరుగుతూనే ఉంటుందట లెక్క. ఇక్కడ సమస్య ఏమిటంటే హిట్లు కొడుతున్న హీరో మంచి ఓపెనింగ్స్ వచ్చే హీరో కాంబినేషన్కు పనికి వచ్చే దర్శకుడు ఇంత రెమ్యూనరేషన్ తీసుకున్న పర్వాలేదు .. కనీసం ఓపెనింగ్ ఉంటుంది యావరేజ్ అయిన ఎన్నో కొన్ని డబ్బులు వస్తాయి. అలా కాకుండా భారీ రెమ్యునరేషన్లు తీసుకుని కొందరు హీరోలు, దర్శకులు నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు.