
హైపర్ ఆది, దీపునాయుడు జోడి గురించి పలు రకాల రూమర్స్ రావడంతో క్లారిటీ ఇస్తూ.. హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని తాను సరదాగా తనని ఫ్లర్ట్ వంటివి చేస్తూ ఉంటారు తప్ప తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని కూడా తెలియజేయడం జరిగింది. హైపర్ ఆది తనకు ప్రొఫెషనల్ గానే పరిచయమయ్యారని తెలియజేసింది. గతంలో హైపర్ ఆది దీపునాయుడు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలో స్కిట్ చేయడం జరిగింది. అప్పటినుంచి తమ మధ్య ఏదో ఉందన్నట్లు రూమర్స్ వినిపించాయని.
అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఒక రీలు కూడా చేశాము.. హైపర్ ఆది ఆ వీడియోలో తాను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు నీకోసమే చేస్తున్నానంటూ చెప్పారు.. మొదట్లో హైపర్ ఆది తీరు కూడా తనకి నచ్చలేదని కానీ స్నేహితుడిగా మారిపోయారని తెలిపింది. ఇక దీపు నాయుడు జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మొత్తానికి హైపర్ ఆది పెళ్లితో క్లారిటీ ఇచ్చేసింది దీపు నాయుడు.