
కానీ, ఘనత వహించిన ఓ మంత్రి వర్యుల నియోజకవర్గంలో మాత్రం మంత్రికి తెలియకుండా.. కొండలు కరిగిపోతున్నాయి. మంత్రికి తెలియకుండానే మట్టి కొండలు మరుగవుతున్నాయి. దీంతో ఈ విషయం పెద్ద ఎత్తున అలజడి రేపుతోంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఏలూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న నాయకుడు ఆయన. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెబుతారు.
కానీ.. ఆయన నియోజకవర్గంలో పర్యటించినా.. పర్యటించికపోయినా.. ఇక్కడ జరుగుతున్న విషయాలైనా ఆయనకు తెలుసా? అంటే.. పెదవి విరుపులు.. నొసటి చిట్లింపులు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏకంగా.. ముఖ్యమంత్రి పేరు చెప్పి మరీ.. మట్టి కొండలు.. గ్రావెల్ కొండలను కొందరు కరిగించేస్తున్నారు. ఉదయం సాయంత్రం, రాత్రి అన్న తేడా లేకుండా నిరాఘాటంగా తోలేస్తున్నారు. తద్వారా.. పొరుగు జిల్లాలకు పంపించేసి సొమ్ములు చేసుకుంటున్నారు.
ఇది నిరంతరం జరుగుతున్నా.. పాపం బయటకు వచ్చే వరకు.. కొందరు పట్టుకునే వరకు కూడా మంత్రి వర్యులకు తెలియకపోవడం గమనార్హం. అంతేనా.. సీఎంవో అధికారులకు తెలిసినా.. కూడా సదరు మంత్రి వర్యులకు మాత్రం గప్‌చుప్ అన్న సౌండ్ కూడా రాలేదట. ఈ విషయం తెలిసిన తర్వాత.. మంత్రి వర్యులే ఆశ్చర్య పోయారు. అయితే.. దీనిపై సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. సదరు నేతకు తెలిసే జరుగుతోందని.. నిప్పు లేకుండా పొగ బయటకు వస్తుందా? అని అంటున్నారు. ఇదీ.. సంగతి..!
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.