
ఇలాంటి సంఘటన నేపద్యంలో ఒక బాలీవుడ్ సినిమాను నిషేదించాలి అన్న డిమాండ్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. వచ్చే నెల మే 9న విడుదల కాబోతున్న ఆమూవీ పేరు అబిర్ గులాల్ ఈమూవీలో పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. అతడి పక్కన హీరోయిన్ గా వాణి కపూర్ నటిస్తోంది. ఆర్తి ఎస్ బాగ్ది దర్శకత్వం వహిస్తున్న ఈమూవీకి అమిత్ త్రివిది సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
పూర్తి లవ్ స్టోరీగా నిర్మాణం జరపుకున్న ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే విడుదల అయింది. వాస్తవానికి పాకిస్తానీ హీరో ఫహద్ ఖాన్ కు ఇది మొదటి సినిమా కాదు. గతంలో ఇతడు 2014లో విడుదలైన ఖూబ్సూరత్ తో తెరంగేట్రం చేశాడు. ఆతరువాత 2016లో, ‘ఏ దిల్ హై ముష్కిల్ లో నటించాడు. ఈసినిమాలు పెద్దగా విజయవంతం అవ్వకపోవడంతో ఈ పాకిస్థాన్ హీరో పెద్దగా అందరికీ తెలియదు. చాల గ్యాప్ తరువాత ఈ హీరో నటిస్తున్న అబీర్ గులాల్ పై చాల ఆశలు పెట్టుకున్నాడు.
టోటల్ లవ్ స్టోరీగా నిర్మాణం జరపుకున్న ఈమూవీని ఇండియాలో విడుదల చేయడానికి అంగీకరించం అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. భారత దేశంలో ఎంతోమంది హీరోలు ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పాకిస్థాన్ హీరోలు ఎందుకు అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. దీనితో ఈమూవీ విడుదల ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జరిగిన ఈ దురదృష్టకర సంఘటన పై ఈ పాకిస్తానీ హీరో ఇప్పటివరకు ఖండించకపోవడం నెటిజన్స్ కు మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది..