బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జాన్వీ సౌత్ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా ? అని అంద‌రూ ఒక్క‌టే ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న వేళ .. నాలుగేళ్ల పాటు ఊరించి ఊరించి ఎట్ట‌కేల‌కు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ .. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ నటించిన ‘ దేవర ’ సినిమా తో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వ‌డం తో అమ్మడికి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా - బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ‘ పెద్ది ’ సినిమా లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్టీఆర్ త‌ర్వాత వెంట‌నే రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా ఆఫ‌ర్ అంటే అది ల‌క్కీ ఆఫ‌రే అనుకోవాలి. ఈ సినిమా కూడా హిట్ అయితే టాలీవుడ్ లో జాన్వీ బ‌ల‌మైన పునాది వేసుకున్న‌ట్టే అవుతుంది.


ఇదిలా ఉంటే జాన్వీ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంద‌ట‌. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ జాన్వీ కపూర్‌తో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్రయత్నాలు మొద‌లు పెట్టిన‌ట్టు కోలీవుడ్ వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ సామాజిక అంశాలపై నడుస్తుందని కూడా స‌మాచారం. దీంతో ఈ వెబ్ సిరీస్‌లో జాన్వీ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని కూడా వార్తలు వ‌స్తున్నాయి. పా రంజిత్ సినిమా ల‌లో చేసిన హీరోయిన్ల కు మంచి పేరు వ‌స్తుంది. మ‌రి ఇప్పుడు రంజిత్ చెప్పిన కథకు జాన్వీ కపూర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె ఈ వెబ్ సిరీస్‌కు ఓకే చెబితే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో ?  కోలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎలా మెస్మ‌రైజ్ చేస్తుందో ?  చూడాలి. అయితే జాన్వీ హీరోయిన్ గా క్రేజ్ ఉండ‌గానే వెబ్ సీరిస్ ఎందుకు చేస్తుందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: