తిరుమలకు సంబంధించి భద్రతా విషయంలో మొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి రాసినటువంటి లేఖకి కేంద్ర హోంశాఖ మంత్రి దానిమీద స్పందన ఇవ్వడం జరిగింది. తిరుమల భద్రత లోపాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే స్పందించిందట.. తక్షణం జోక్యం చేసుకోవడం అవసరమంటూ ఎంపీ మధ్యల గురుమూర్తి చేసినటువంటి ఫిర్యాదు మీద కేంద్ర ప్రభుత్వం , కేంద్ర హోంశాఖ కూడా స్పందించింది. హోంశాఖ మంత్రి సెక్రటరీ మృత్యుంజయ త్రిపాఠీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారట.



ఈ అంశం మీద క్షుణ్ణంగా  పరిశీలించి ఒక రిపోర్ట్ పంపమని అడిగారట.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల భద్రత చాలా కీలకం అట్లాంటి చోట వరుసగా చోటు చేసుకుంటున్న సంఘటనలు భద్రత లోపాల వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలుపుతున్నారు. అయితే ఈ లేఖలో భక్తుల రక్షణ కావలసిన భద్రత ఏర్పాట్లను మెరుగుపరిచేలా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఉందని కానీ రెడ్ బుక్ రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ మీద పాలన పట్టు కోల్పోతోందంటూ తెలియజేశారు. తిరుమల భద్రత లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేసేలా ఉన్నాయంటూ తెలిపారట.

వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు అంటూ తెలియజేశారు.. అక్కడే లిక్కర్ దొరకడం, మాంసం వంటివి పైకి తీసుకు రావడం వంటివి మొన్న జరిగిన పరిణామాలు తెలిసాయి.. ఇప్పుడు ఈ లేఖకు అక్కడి నుంచి వచ్చినటువంటి స్పందన.. ఇదే అన్నట్లుగా తెలియజేస్తున్నారు. మరి తిరుపతి భద్రతా లోపం విషయం పైన అటు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందనే విషయం చూడాలి మరి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విషయంలో కూడా అలర్ట్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మరి నివేదికలు ఏం చెబుతాయో చూడాలి. టీటీడీ చైర్మన్ ఎలా స్పందిస్తారు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: