విజ‌య‌వాడ ఎంపీగా కేశినేని శివ‌నాథ్‌.. ఉర‌ఫ్ చిన్న వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే. అనూహ్య రీతిలో ఆయ‌న గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. రాజ‌కీయ బాట ప‌ట్టారు. అన్న‌ను ఎదిరించిన త‌మ్ముడిగా ఆయ న పేరు ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు చేరువ కావ‌డంలో మాత్రం అచ్చంగా ల‌క్ష్మ‌ణుడ‌నే పేరు తెచ్చుకున్నారు. వాస్త‌వానికి.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు..  విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. విజ‌య‌వాడపై దాదాపు రాజ‌ధాని ప్ర‌భావం ఉంటుంది.


దీనికితోడు కొంత న‌గ‌ర ప్రాంతం.. మ‌రికొంత లోత‌ట్టు ప్రాంతంతో ముడిప‌డిన విజ‌య‌వాడ‌లో ఎంపీకి చేతి నిండా ప‌ని ఉంటుంది. దీనిని స‌వాలుగా తీసుకుని.. ముందుకు సాగ‌డంలో చిన్ని స‌క్సెస్ అవుతున్నారు. మ‌రీముఖ్యంగా నాయ‌కుల మ‌ధ్య వివాదాలు.. విభేదాలు రాకుండా చూసుకుంటున్నారు. అంద‌రినీ క‌లు పుకొని పోతున్నారు. గ‌తంలో కేశినేని నానితో చాలామందివిభేదించారు. దీంతో స‌గం మంది నాయ‌కుల‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్టి.. ఒంట‌రిగా ముందుకు సాగాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.


అయితే.. ఇలాంటి ఒడిదుడుకుల‌ను ప‌క్క‌న పెట్టిన ఎంపీ చిన్న ముందుకు సాగుతుండ‌డంగ‌మ‌నార్హం. అంతేకాదు.. గ‌తంలో ఎంపీగా ఉన్న నాని చేసుకున్న ఒప్పందాల‌ను.. టాటా సంస్థ‌తో క‌లిసి ముందుకు సాగిన విధానాన్ని కూడా.. ఇప్పుడు కొన‌సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్థ ప‌నులు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆయా ప‌నులు నిర్విఘ్నంగా సాగేలా.. చిన్న స‌హ‌క‌రిస్తున్నారు. ఎక్క‌డా ఈగోల‌కు పోకుండా అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు.


అయితే.. పార్టీలో ఉన్న చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా నాయ‌కుల‌కు మాత్రం ఎంపీ అందుబాటులో ఉండ‌డం లేద న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదేసమ‌యంలో ఎవ‌రు ఏం చెప్పినా వినేస్తున్నార‌ని.. దానినే నిజంగా భావి స్తున్నార‌న్న విమ‌ర్శ కూడా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు చిన్న విష‌యాల‌ను ప‌రిహ రించుకుంటే.. ఎంపీ తీరుకు మంచి మార్కులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి చిన్న ఏం చేస్తారో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌తో స‌మ‌స్య మీది.. ప‌రిష్కారం మాది..

అవినీతి అయినా.. లంచాలైనా.. రాజ‌కీయ నాయ‌కులు పెట్టే ఇబ్బందులు అయినా మీ స‌మ‌స్య‌ను మా స‌మ‌స్య‌గా భుజాన వేసుకుంటాం. నేత‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అధికారులు దురుసుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని చింతించాల్సిన అవ‌సర‌మే లేదు. రండి.. చేయి చేయి క‌లుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ స‌మ‌స్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.. ప‌రిష్కార మార్గాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: