సాధారణంగా ఎక్కడైనా సరే అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య వివాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకోవడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము.కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి నాయకులు ఎవరికి ఇమడడం లేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తమలో తామే కొట్టుకుంటున్నారట.కానీ ఇది పైకి కనిపించలేదని విధంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి, జెసి బ్రదర్స్ అన్నట్లుగా ఉండేది.. అయితే ఇప్పుడు దగ్గుబాటి వెంకటప్రసాద్ తో ఢి అన్నట్లుగా కనిపిస్తోంది.


అటు చేసి బ్రదర్స్ వర్గీయులు కూడా నియోజకవర్గంలో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ దగ్గుబాటి ప్రసాద్ కూడా అంతే దూకుడుగా కొనసాగుతున్నారట. వీటికి తోడు గుంతకల్లు నియోజకవర్గం లో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది వైసిపి పార్టీ నుంచి టిడిపిలోకి వచ్చిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తమ పార్టీ నాయకుల పైనే ఎక్కువగా గొంతు లేపుతున్నారట. ఎవరైనా ప్రశ్నించిన కూడా ఆయన స్వరం వేరేగా ఉంటుందని సొంత పార్టీ నాయకులే తెలియజేస్తున్నారట.


అలాగే కళ్యాణదుర్గం సురేంద్రబాబు వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ టిడిపి నేతలు ఏమైనా అడిగినా కూడా ఆయన చేయలేనని పరిస్థితి చెప్పేస్తూ ఉన్నారట. ఇదే సమయంలో తనకు పరిచయం ఉన్న కొంతమంది వైసీపీ నేతలతో మాత్రమే అందుబాటులో ఉంటున్నారని విమర్శలు కూడా సురేంద్రబాబు పైన వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన అటు టిడిపి తమ్ముళ్లు కూడా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక శింగనమల నియోజవర్గంలో కూడా ఇదే పరిస్థితి మొదలయ్యింది. టిడిపి నేతలకు దూరంగా ఉన్న ఎమ్మెల్యే శ్రావణి వివాహ ఇస్తున్న తీరు కూడా అందరికీ అసహనాన్ని కలిగిస్తోందట. అంతేకాకుండా సొంత నేతల మీదే తిరుగుబాటు చేస్తోందనే విధంగా గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సీమలోని నేతల పరిస్థితి ఇలా ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి: