నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్-3  మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ చచ్చినా మళ్ళీ దాని జోలికి పోను అంటూ చెప్పి సంచలనం సృష్టించారు. మరి ఇంతకీ నానికి అంతగా విరక్తి పుట్టిన ఆ విషయం ఏంటి.. చచ్చిన దాని జోలికి పోను అని..నా జీవితంలో అది ముగిసిపోయిన అధ్యాయం అని దేని గురించి మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. అటు నిర్మాతగా ఇటు హీరోగా సంచలన విజయాలు అందుకుంటున్న నాని వరుస హిట్స్ ని ఖాతాలో వేసుకుంటున్నారు. నాని నటించిన దసరా,హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలు వరుసగా హిట్ కొట్టడంతో నాని హిట్ -3 మూవీ పైన అందరికీ భారీ హోప్స్ ఉన్నాయి. ఇక హిట్, హిట్-2 రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో హిట్ -3 మీద కూడా ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నానికి బిగ్బాస్ రియాల్టీ షో గురించి ఒక ప్రశ్న ఎదురైంది. బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ఫుల్గా పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్ ప్రారంభమవబోతుంది. అయితే మీరు బిగ్ బాస్ -2 కి హోస్ట్ గా చేశారు కదా.. మళ్లీ బిగ్ బాస్ హోస్ట్ గా చేసే అవకాశం ఉందా అని యాంకర్ ప్రశ్నించగా.. నాకు మళ్ళీ బిగ్ బాస్ కి హోస్టుగా చేసే ఇంట్రెస్ట్ అయితే లేదు.అది నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం.. మళ్లీ దాని జోలికి వెళ్ళాలి అనుకోవడం లేదు. బిగ్ బాస్ బయట ప్రపంచం ఎలా ఉంటుందో నాకు చాలా భిన్నంగా చూపించింది. అందులో ఉన్న వాళ్ళ ఎమోషన్స్ లో నేను ఇన్వాల్వ్ అయిపోయాను.

అంతా నార్మల్గానే ఉంటుంది అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్లాక చాలా ఎమోషనల్ అయిపోయాను. బిగ్ బాస్ అనేది నా జీవితంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్.. మళ్లీ దాని జోలికి వెళ్ళను అంటూ బిగ్ బాస్ గురించి స్పందించారు నాని.ఇక నాని బిగ్ బాస్ 2 కి హోస్టుగా చేశారు. ఆయన హోస్టుగా చేసిన సమయంలో కౌశల్ విన్నర్ అవ్వగా.. గీతా మాధురి రన్నరప్ గా నిలిచింది.ఇక గత కొద్దిరోజుల నుండి బిగ్ బాస్ కి హోస్టుగా చేస్తున్న నాగార్జున ఈ సీజన్లో తప్పుకుంటారని బిగ్ బాస్ 9 కి హోస్టుగా బాలకృష్ణ,రానా, విజయ్ దేవరకొండ వీరిలో ఎవరో ఒకరు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ 9 హోస్టుగా ఎవరు చేయబోతున్నారనేది ముందు ముందు తెలుస్తుంది. ఇక నాని నటించిన హిట్ 3 మూవీ మే 1 న విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: