సహాయ దర్శకుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన నాని అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారిపోయారు. అయితే మొదటి సినిమాను హిట్ కొట్టడంతో నానికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి.అలా తన న్యాచురల్ యాక్టింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకున్న నాని ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయారు. అయితే గత కొద్ది రోజుల నుండి నాని నటించిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో నాని రేంజ్ ఇండస్ట్రీలో పెరిగిపోయింది. అయితే నాని ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలతో ఎక్కువగా అలరిస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది హీరోలు మాస్ కంటెంట్ లనే ఎంచుకుంటున్నారు.. అలా వారి బాటలోనే నాని కూడా వెళ్లి దసరాతో హిట్టు కొట్టారు. ఇక త్వరలోనే నాని నటించిన హిట్టు -3 మూవీ విడుదల కాబోతోంది.ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించబోతున్నారు. 

ఇప్పటికే ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో నాని పాత్ర ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. ట్రైలర్ ను బట్టి సినిమా భారీ హిట్ అని అంటున్నారు నాని అభిమానులు. ఇదిలా ఉంటే తాజాగా నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో వచ్చిన కోర్టు మూవీ ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీ లోను సంచలనం సృష్టిస్తోంది. రామ్ జగదీష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది.అయితే ఈయన కొత్త దర్శకుడు అయినప్పటికీ నాని ఆయన చెప్పిన కథ మీద నమ్మకం పెట్టుకొని తన బ్యానర్లో ఈయనకి అవకాశం ఇచ్చారు. అలా నాని నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు డైరెక్టర్ రామ్ జగదీష్. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నిర్మాతలు వాళ్లు నిర్మించిన సినిమాలు అనుకున్న దాని కంటే ఎక్కువ హిట్స్ అయితే హీరోలకి, దర్శకులకి, హీరోయిన్లకి గిఫ్ట్ లు ఇవ్వడం ఆనవాయితీ గా మారిపోతుంది.

ఇప్పటికే చాలామంది నిర్మాతలు హీరోలకి,దర్శకులకి ఖరీదైన బహుమతులు ఇచ్చారు.అలా తాజాగా సంచలనం సృష్టించిన కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ కి కూడా హీరో నాని ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చారట. అయితే ఈ విషయాన్ని నాని ఎక్కడ కూడా బయట పెట్టకపోయినప్పటికీ గిఫ్ట్ అందుకున్న రామ్ జగదీష్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో హీరో నాని గారి చేతుల మీదుగా కారుని అందుకోవడం నా లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్ అని చెప్పుకొచ్చారు.అలా డైరెక్టర్ చెప్పే వరకు కూడా నాని కారుని గిఫ్టుగా ఇచ్చిన విషయం ఎవరికీ తెలియదు. చాలామంది ఇలాంటి గిఫ్టులు ఇస్తే ఫోటోల బయటికి రివీల్ చేస్తారు. కానీ నాని మాత్రం ఎక్కడా కూడా ఈ విషయాన్ని చెప్పుకోలేదు

మరింత సమాచారం తెలుసుకోండి: