నటుడు నవదీప్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇతను హీరోగా అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. నవదీప్ తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలోను నటించాడు. సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెట్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఈ హీరో అనేక సినిమాలలో తాను చేయబోయే పాత్ర చాలా స్పెషల్ గా ఉండే విధంగా చూసుకుంటాడు. నవదీప్ కొద్ది రోజుల క్రితం కొన్ని ప్రోగ్రామ్స్ లను కూడా నిర్వహించాడు. నవదీప్ యాంకర్ గా కూడా వ్యవహరిస్తాడనే విషయం తెలిసిందే. 

ఇక ఈ హీరో రీసెంట్ గా కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. రీసెంట్ గా "టచ్ మీ నాట్" అనే సిరీస్ లోను యాక్టింగ్ చేశాడు. ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉండగా.... ఈ హీరో వయసు పెరిగినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే తన లైఫ్ కొనసాగిస్తున్నాడు. కానీ కొంతమందితో ఎఫైర్ కొనసాగించాడని అనేక రకాల వార్తలు వచ్చినప్పటికీ వాటిపై నవదీప్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కాగా, నవదీప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.

తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. ఆ ఫోటోలను అభిమానులు పలు రకాలుగా స్పందిస్తారు. కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. అలాంటి వారికి నవదీప్ తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే నవదీప్ టాలీవుడ్ లో ఉన్న ఓ హీరోయిన్ తో సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారట. అంతే కాకుండా త్వరలోనే ఆ అమ్మాయితో కలిసి పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నట్లుగా నవదీప్ సన్నిహితులు చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే నవదీప్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: