టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డేకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో ఆమె సక్సెస్ రేట్ తగ్గినా ఆమెను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. పూజా హెగ్డే త్వరలో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి.
 
త్వరలో రాబోయే రెట్రో సినిమా నన్ను పూర్తి భిన్నంగా చూపిస్తుందని ఈ సినిమా నా సామర్థ్యాన్ని పరీక్షించిందని ఆమె తెలిపారు. యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్ కలయికతో రూపొందిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా డైరెక్టర్ ఫస్ట్ డే స్క్రిప్ట్ కోసం కలవబోతున్న సమయంలో నన్ను మేకప్ లేకుండా రావాలని చెప్పారని ఆమె తెలిపారు.
 
నాకు మేకప్ లేకుండా సహజంగా కనిపించే సినిమాల్లో పని చేయడం అంటే చాలా ఇష్టమని రాధేశ్యామ్ మూవీలో నా యాక్టింగ్ లో ఎమోషన్స్ ను చూసి రెట్రో మూవీకి సరిగ్గా సరిపోతానని డైరెక్టర్ భావించారని పూజా హెగ్డే కామెంట్లు చేశారు. ఎన్నో హిట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలలో నేను భాగమయ్యానని కానీ ఇప్పటివరకు నేను బయోపిక్ లో నటించలేదని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
 
నేను గతంలో ఎప్పుడూ చేయని జానర్ ఇది అని ఆమె కామెంట్లు చేశారు. నాకు ప్రముఖ వ్యక్తుల జీవితాలకు బదులుగా స్వాతంత్ర పోరాట యోధుల కథల్లో భాగమవ్వాలని ఉందని ఈ సినిమాలతో పాటు క్రీడా నేపథ్య సినిమాలలో కూడా నటించాలని ఉందని పూజా హెగ్డే కామెంట్లు చేయడం గమనార్హం. తమిళ ఇండస్ట్రీ నుంచి నాకు మొదటి ఆఫర్ వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో నో ఎలా చెప్పాలో తెలిసేది కాదని ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని పూజా హెగ్డే తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: