
ఇటీవలే ఈ అందాల భామ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇదిలా ఉండగా ఈ బ్యూటీ ఎల్లప్పుడూ అభిమానుల మనసు దోచేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాయి పల్లవి ఇటు తెలుగుతో పాటుగా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఉండేవారు అందరూ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. కానీ సాయి పల్లవి కోసమే అవకాశాలు ఎదురుచూస్తున్నాయి. అందులోనూ ఈ భామ ఏ సినిమా పడితే ఆ సినిమా చేయదు. సినిమాలోని పాత్ర ఈమెకి నచ్చితేనే చేస్తుంది. అది ప్యాన్ ఇండియా మూవీ అయిన సరే తనకి పాత్ర నచ్చకపోతే నో చెప్పేస్తుంది. ఇప్పుడు సాయి పల్లవి హిందీలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన ఓ మీటింగ్ లో ఈమె మాట్లాడుతూ.. తనకి అవార్డులు అక్కర్లేదు అని.. వాటి కంటే అభిమానుల అభిమానమే ముఖ్యం అని చెప్పుకొచ్చింది. తాను ఏ పాత్రలో నటించిన తన నటనకు ప్రేక్షకులు కనెక్ట్ అయితే అదే తనకు గొప్ప విజయం అని తెలిపింది.