న్యాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని బిజీగా ఉండగా ఈ సినిమాలతో నానికి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హిట్3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నాని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియ వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
నాకు శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం అని నాని చెప్పుకొచ్చారు. నేను శ్రీదేవిని ఆరాధించానని క్షణక్షణం సినిమాను నేను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదని నాని చెప్పుకొచ్చారు. ఆ సినిమా లక్షల సార్లు చూడదగిన సినిమా అని నాని కామెంట్లు చేశారు. శ్రీదేవి అంత అందంగా ఎలా ఉన్నారో ఇప్పటికీ నాకు అర్థం కాదని నాని వెల్లడించారు. క్షణక్షణం సినిమాకే శ్రీదేవి అందాన్ని తెచ్చారంటూ నాని పేర్కొన్నారు.
 
హిట్3, రైడ్2 ఒకేరోజు రిలీజ్ కావడం గురించి నాని మాట్లాడుతూ రైడ్2 కు ప్రాధాన్యత ఇవ్వాలని అజయ్ సార్ తో నాకు పోటీ లేదని మీకు వీలుంటే హిట్3 సినిమాను థియేటర్లలో చూడాలని నాని పేర్కొన్నారు. నాని రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. నాని రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
హిట్3 సినిమా శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటించారు. హిట్3 సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. హిట్3 సినిమా ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: