
అయితే ఇలాంటి నేపథ్యంలో... రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోడీ... పాకిస్తాన్ దేశానికి ఊహించని షాక్ ఇచ్చాడు. ఆ దేశంలో కరువు ఏర్పడేలా సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేబినెట్ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం నిర్వహించారు. పహాల్గాం ఉగ్రదాడి మృతులకు కేబినెట్ కమిటీ నివాళులర్పించింది.
అలాగే.. 1960 సంవత్సరం నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం. అటారి - వాగా సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పర్యటకులు వెంటనే ఇండియాను వదిలి వెళ్లిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా.. పాకిస్తాన్ దేశాన్ని ఎడారిగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. అదే సింధు జలాల సహకారాన్ని నిలిపివేయడమే భారత తీసుకున్న అతిపెద్ద నిర్ణయం.
ఈ సింధు జలాల ఒప్పందం ప్రకారం దాదాపు... 70 శాతం వాటా నీళ్లు పాకిస్తాన్ కు వెళ్లేవి. 30% ఇండియాకు వచ్చేవి. అంటే ఇండియా కంటే పాకిస్తాన్ కు ఈ సింధు జలాల ఒప్పందం కారణంగా లాభం చేకూరుతుంది. అయితే ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని మోడీ ప్రభుత్వం. ఇకపై... ఇండియా ఎక్కువగా ఆ నీళ్లను వాడుకోవచ్చు. ఈ దెబ్బకు పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయమని అంటున్నారు. పాకిస్తాన్లో నీటి వనరులు చాలా తక్కువ. వాళ్లకు సింధు జలాలు తప్ప నీళ్లు రావు. ఇప్పుడు అక్కడే దెబ్బ పడింది.