నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం అంటే సుందరానికి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. అంతే సుందరానికి మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా దసరా అనే పవర్ఫుల్ మాస్ మూవీ లో హీరో గా నటించాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను మరియు పాటలను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను మార్చి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన మరో అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వేదికను ఖరారు చేసింది.

అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదల ను లక్నో లోని ప్రతిభ థియేటర్ లో మార్చి 14 వ తేదీన మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు దసరా మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: