క్యూట్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు అయితే లేరు.. ఒక్క సినిమా తో ఈమె స్టార్ హీరోయిన్ స్థాయికు ఎదిగిపోయిందనే చెప్పాలి.


శ్రీలీల అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను .. పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టిన ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..

శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో బాగా దూసుకు పోతుంది.. ఇక ధమాకా హిట్ తర్వాత అమ్మడికి స్టార్ హీరోల్లో కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి.. తెలుగులో నే కాకుండా కన్నడ మరియు తమిళ్ భాషల్లో కూడా వరుస సినిమాలకు ఈమె సైన్ చేస్తున్నట్టు సమాచారం.. అలాగే తాజాగా ఈ భామకు అంతర్జాతీయ సినిమా లో అవకాశం వచ్చింది అని తెలుస్తుంది.

ఇంటర్నేషనల్ సినిమా అంటే చెప్పాల్సి న అవసరం లేదు.. ఈమె 'చెన్నై స్టోరీ'అనే ఇంగ్లీష్ సినిమాలో నటించ బోతున్నట్టు సమాచారం.ఇప్పుడు ఆ వార్త బాగా వైరల్ అవుతుంది.. మొన్నటి వరకు ఈ సినిమాలో సమంత పేరు వినిపించ గా.. ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తుందని తెలుస్తుంది...

ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించ నుండ గా ఇంగ్లాండ్ కు చెందిన వివేక్ కల్రా హీరో గా నటిస్తున్నాడటా.ఇంగ్లాండ్ యువకుడికి చెన్నైకు చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చెన్నై భామ గా ఎవరు కనిపిస్తారో చూడాలి మరి.

ఇక ఈ బ్యూటీ తెలుగు లో మహేష్ బాబుతో ఒక సినిమా అలాగే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా, రామ్ పోతినేని తో ఒక సినిమా, విజయ్ దేవరకొండలో ఒక సినిమా చేస్తుందటని సమాచారం.ఈ సినిమాలు కనుక మంచి విజయం సాధిస్తే పాన్ ఇండియా స్థాయి మూవీస్ లో కూడా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: