కరోనా పరిస్థితులు అనేక వ్యాపార రంగాలలో పెనుమార్పులు తీసుకు వచ్చింది. నిన్న మొన్నటి వరకు స్టాక్ మార్కెట్ అంటే ఇష్టపడని మహిళలు ఇప్పుడు ఒక్కసారిగా ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం కార్పొరేటు వర్గాలను కూడ ఆశ్చర్య పరుస్తోంది. ఈట్రెండ్ కేవలం నగరాలలో మాత్రమే కాకుండా ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలలో కూడ కనిపించడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది.


గతంలో ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం అంటే మహిళలు ఒక జూదంగా భావించేవారు. అందువల్ల తమ దగ్గర ఉన్న డబ్బును ఎక్కువగా బంగారం ఫిక్సెడ్ డిపాజిట్ల పై పెట్టుబడులు పెట్టేవారు. ప్రస్తుతం బ్యాంక్ వడ్డీ రెట్లు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు బంగారం ధరలో తీవ్ర ఒడుదుడుకులు కనిపిస్తున్న పరిస్థితులలో ప్రత్యామ్నాయంగా ఈక్విటీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అన్నఅభిప్రాయంలో చాలామంది మధ్యతరగతి మహిళలు ఉన్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు.

ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్ లో వస్తున్న పెట్టుబడులలో 35 శాతం వరకు మహిళల నుండి రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. లాక్ డౌన్ కొన్ని నెలలపాటు కొనసాగడంతో అందరు ఇళ్లకే పరిమితం అవ్వడంతో ముఖ్యంగా మహిళలు ఈ ఖాళీ సమయంలో షేర్ మార్కెట్ పై అవగాహన పెంచుకున్నారని తెలుస్తోంది.


ప్రముఖ బ్రోకరింగ్ సంస్థ షేర్ ఖాన్ అంచనాల ప్రకారం గత మూడు నెలలుగా పెరుగుతున్న డీమ్యాట్ ఖాతాలలో 32 శాతం మంది మహిళలే ఉన్నట్లు అంచనాలు వస్తున్నాయి. ఇందులో 70 శాతం మంది మహిళలు కొత్తగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడం శుభసూచికం అని అంటున్నారు. ప్రస్తుతం ఎంటర్ అవుతున్న ఈ మహిలలో 55 శాతం మంది రోజువారి ట్రేడింగ్ లో బిజీగా ఉంటే 45 శాతం మంది ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్నారని మరొక సర్వే తెలియ చేసింది. ప్రస్తుతం చాలామంది పురుషులు తాము పనిచేస్తున్నఉద్యోగాలలో కోతలు ఎదుర్కుంటున్న పరిస్థితులలో ఇంటి అవసరాలు తీర్చడం కోసం మహిళలు ఇలా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటూ ప్రముఖ ఆర్ధిక విశ్లేషకుడు నిఖిల్ కామత అభిప్రాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: