సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక అలాంటి సమయంలో ఎంతోమంది ఎలాంటి వ్యాపారాన్ని చేయాలో అని తెలియక సతమతమవుతూ ఉంటారు. ఇకపోతే తక్కువ పెట్టుబడితో ప్రతినెలా కచ్చితంగా లాభం పొందాలని ఆలోచించే వారి కోసం ఒక బిజినెస్ ఐడియాను తీసుకురావడం జరిగింది. ఇక అదే ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం. బూడిదతో తయారు చేయబడిన ఇటుకలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక రాబోయే కాలంలో కూడా వీటికి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు.


ఇకపోతే వేగవంతమైన పట్టణీకరణ యుగంలో..  బిల్డర్లు ఇప్పుడు బూడిదతో తయారు చేసిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం మీరు 100 గజాల స్థలంలో కనీసం రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టవచ్చు. ఇక ఈ వ్యాపారం ద్వారా ప్రతినెల కచ్చితంగా రూ.50 వేలకు పైగా లాభం మిగులుతుందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటుకలను పవర్ ప్లాంట్ల నుండి సిమెంటు , బూడిద  రాతిధూళి మిశ్రమం నుండి తయారు చేస్తారు .ఇకపోతే ఈ ఇటుకల తయారీకి మాన్యువల్ యంత్రాన్ని 100 గజాల సౌకర్యంలో సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు. ముఖ్యంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఐదు మంది వ్యక్తులు కూడా అవసరం అవుతారు.


ప్రతిరోజు దాదాపు 3000 ఇటుకలను తయారు చేయవచ్చు. ఇక మీకు పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ మిషన్ ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు . ఇక ఈ మెషిన్ ధర 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది . ముడి సరుకు కలపడం దగ్గర నుంచీ ఇటుకల తయారీ వరకు మొత్తం యంత్రం ద్వారానే పనులు జరిగిపోతాయి. ఇకపోతే ఆటోమేటిక్ యంత్రంలో గంటకు వెయ్యి ఇటుకలను తయారు చేయవచ్చు. ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ , ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మట్టిలేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మీరు తక్కువ పెట్టుబడితో ఇలాంటి ఇటుకలను తయారుచేసి ఎగుమతి చేయడం వల్ల కచ్చితంగా మీకు మంచి ఆదాయం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: