
కమర్షియల్ పద్ధతిలో బే ఆకు సాగు చేస్తే తక్కువ శ్రమతో.. తక్కువ ఖర్చుతో.. ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ సాగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఒక్కసారి ఈ మొక్కలు నాటితే.. చాలా సంవత్సరాలు దిగుబడిని అందిస్తాయి. ముఖ్యంగా ఈ మొక్కలు నాటడానికి 6 మీటర్ల దూరంలో నాణ్యమైన బే ఆకు మొక్కలను నాటాలి. లైన్ నుండి లైన్ మధ్య కూడా తగినంత దూరం ఉంచాలి. క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ మొక్కలు చిన్నగా ఉన్నంతవరకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలను కూడా నాటుకొని అదనపు ఆదాయం పొందవచ్చు. ఇకపోతే దీనిని సాగు చేసే రైతులకు జాతీయ ఔషధ మొక్కల బోర్డు 30% సబ్సిడీలు కూడా అందిస్తోంది.
మీరు 1 బే లీఫ్ మొక్క నుండి సంవత్సరానికి 5000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మరొకవైపు 25 మొక్కలు నాటితే ప్రతి సంవత్సరం రూ. 1,25,000 వరకు లాభం వస్తుంది. ఎక్కువ మొక్కలు నాటితే మీ ఆదాయం కూడా మరింత పెరుగుతుంది. ఇక నష్టం లేని పంట ఆదాయాన్ని ఎక్కువగా అందిస్తుంది కాబట్టి నిరబ్యంతరాయంగా ఈ పంటను మీరు పండించవచ్చు. అంతేకాదు అది తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి.