కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చేనేత వస్త్ర కళాకారులను.. కల్లు గీతా కార్మికులను, ఇంకా వృద్ధులను ఆదుకోవడానికి వివిధ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే . అలాగే పేద, నిరుపేద మహిళల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వితంతు పెన్షన్ పథకం కూడా ఇప్పుడు ముఖ్యమైనది. ముఖ్యంగా వితంతు పెన్షన్ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని వితంతువులకు ప్రతినెల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.

ఇక భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను ఆదుకోవడమే లక్ష్యంగా 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న మహిళలకు వితంతువుల దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా వితంతువులు మరణించిన తర్వాత వారి వారసులు లేదా ఇతర కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హులు కారు అన్న విషయాన్ని గుర్తించాలి. ఇక ఈ పథకం కింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నెలకు రూ.300 నుంచి గరిష్టంగా రూ.2000 వరకు అందజేస్తారు వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వితంతువులకు మాత్రమే ఈ ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

ఇక తమిళనాడు రాష్ట్రం విషయానికొస్తే ఈ పథకం కింద వితంతులకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. దారిద్రరేఖకు దిగువన వున్న వితంతువులు మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏ ఇతర పెన్షన్ పథకాన్ని పొందని మహిళలకు మాత్రమే అందించబడుతుంది.  దరఖాస్తు చేసుకోవాల్సిన మహిళల వయోపరిమితి 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక భర్త చనిపోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటే.. ఈ పథకం కింద ప్రయోజనం పొందలేరు. అభ్యర్థి యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్,  ఐడెంటి ప్రూఫ్,  వయసు సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్ , ఆదాయ ధ్రువీకరణ పత్రం, భర్త మరణ ధృవీకరణ పత్రం వంటివి దరఖాస్తు కోసం అందించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: