పెరుగుతున్న ఆహార ధరల నుంచి వినియోగదారులకు సైతం ఉపశమనం కలిగించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరి 6వ తేదీన భారత్ రైస్ పేరిట కిలో 29 రూపాయలు సబ్సిడీతో ప్రారంభించింది. దీనిని కేంద్ర ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. వీటితోపాటు మొబైల్ వ్యాన్లను కూడా ప్రారంభించారు మొదటి దశ ఈ రోజున నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్..NAFED,NCCF వంటి మొబైల్ అవుట్లేట్లలో భారత్ రైస్ ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. దాదాపుగా 5 లక్షల టన్నుల బియ్యాన్ని సైతం ఆహార సంస్థ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది.


5 కిలోలు 10 కిలోల ప్యాకింగ్ లు వినియోగానికి అందుబాటులో ఉంచారు త్వరలోనే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా ఈ భారత్ అందుబాటులోకి రాబోతోంది. రాబోయే రోజుల్లో సామాన్య ప్రజలకు కూడా దీనివల్ల భారీ ఉపశమనం లభిస్తుందని.. అన్నం ఎక్కువగా తినే తెలుగు రాష్ట్రాలలోనైన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తో పాటు కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ స్కీం మరింత ఉపయోగకరంగా ఉంటుందంటూ కేంద్రమంత్రి ఫియూష్ గోయల్ తెలియజేశారు.

ప్రస్తుతం క్వింటా సన్న బియ్యం ధర దాదాపుగా 6500 వరకు చేరింది. చాలామంది బ్రోకర్స్ రైస్ మిల్లులు సంస్థలు కూడా కొన్న ధరకు అదనంగా 5 నుంచి 8 రూపాయల వరకు పెంచేస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో 25 కిలోల పాత బియ్యం దాదాపుగా 1500 రూపాయలకు పైగానే పోతుంది. గత ఏడాది సన్న బియ్యం క్వింటా 3000 నుంచి 3500 ఉండగా పాత బియ్యం 4200 ఉండేది.. కానీ ఇప్పుడు ఒకేసారి 6,500 రూపాయల వరకు వెళ్లడంతో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణంలోకి తీసుకొని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరలకే బియ్యాన్ని అందించాలని దీంతో కేవలం 29 రూపాయలకే భారత్ రైస్ ను ప్రవేశపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: