మన టాలీవుడ్ లో బాగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకూ పారితోషికాలు తీసుకుంటూ ఉంటే అదే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అయితే మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకూ పారితోషికాలు తీసుకుంటారు అంటూ వార్తలు వస్తూ ఉంటాయి. ఇందులో ఎన్ని నిజాలో తెలియదు కాని మన గ్లామరస్ హీరోయిన్స్ కు మాత్రం చాలా భారీగానే పారితోషికాలు ముడుతున్నాయి అనేది వాస్తవం. మరి హాలీవుడ్ లో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్స్ కు పారితోషికాలు ఎంత ఉంటాయి..? అని ఆలోచిస్తే మాత్రం బయటకు వచ్చే పారితోషిక మొత్తాలు వింటే ఎవరికైనా గుండె గుభేల్ మనడం ఖాయం.

ప్రస్తుతం హాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఎంజెలినా జోలి గురించి ఈమధ్య ఫోర్బ్స్ పత్రిక ప్రచురించిన విషయాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు కలిగించాయి. ఈమె 2012 జూన్ నుంచి 2013 జనవరి మధ్య సంపాదించిన మొత్తం ఫోర్బ్స్ పత్రిక అంచనాల ప్రకారం దాదాపు 180 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. గత ఆరునెలల కాలంలో ఆమె కాల్ షీట్స్ విలువ 180 కోట్లు గా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ లెక్కన ఎంజేలినా సంపాదన రోజుకు కోటి రూపాయలు అన్న మాట. ఈ సంపాదనతో హాలీవుడ్ లో అత్యధిక పారితోషికం పొందుతున్న హీరోయిన్ గా ఎంజెలినా రికార్డు కు ఎక్కింది అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఆమె అందాలకు మైమరచిపోతూ ఉంటారు. అంత అద్భుతమైన సుందరి కాబట్టి ఆ మాత్రం పారితోషికం రోజుకి కోటి రూపాయలు ఉండడం సహజమే కదా..!

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: