అక్కినేని నాగేశ్వరావు మనువుడుగా సుశాంత్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దశాబ్ధం దాటిపోయినా ఇంకా హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. దీనితో ప్రత్యేక పాత్రలో నటించడానికి ఇతడు ఓకె చెప్పడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో తీస్తున్న మూవీలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. 

అయితే ఈ మూవీలో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాల కుటుంబాలలో కనిపించిన కుండమార్పిడి పెళ్ళిళ్ళను ఈతరం ప్రేక్షకులకు త్రివిక్రమ్ వెరైటీగా చూపించబోతున్నాడు. ఈమూవీ హీరోయిన్ పూజా హెగ్డే సుశాంత్ చెల్లెలుగా నటిస్తూ అల్లు అర్జున్ ను ప్రేమిస్తే బన్నీ చెల్లెలి పాత్రలో నటిస్తున్న నివేదా థామస్ సుశాంత్ ను ప్రేమిస్తుందని తెలుస్తోంది. 

దీనితో ఈ కుండమార్పిడి పెళ్ళిలో వచ్చే కామెడీని ఆధారంగా తీసుకుని త్రివిక్రమ్ తండ్రి సెంటిమెంట్ తో ఈమూవీ కథను అల్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించిన నివేదా థామస్ ను బన్నీ చెల్లెలుగా నటించడానికి త్రివిక్రమ్ ఎలా ఒప్పించాడు అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి ఈమూవీ షూటింగ్ చాల వేగంగా పూర్తి అవుతున్నా ఈ సంవత్సరం విడుదల చేయడానికి రకరకాల భారీ సినిమాల డేట్స్ కన్ఫ్యూజన్ రావడంతో ఈమూవీని సంక్రాంతి రేస్ లో దింపుతున్నారు. ఒకప్పటి ఆనాటి తరానికి సంబంధించిన ఈ కుండమార్పిడి పెళ్ళిళ్ళ వచ్చే కామెడీని ప్రేక్షకులు తెగ నవ్వుకునేడట్లుగా త్రివిక్రమ్ ఈమూవీలో సీన్స్ డిజైన్ చేసి తన ప్రతిభను డైలాగ్స్ లో చూపెడుతున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: