ఎట్టకేలకు చిరంజీవికి హీరోయిన్ దొరికింది. మెగాస్టార్ తో కొరటాల సినిమా అనుకొని ఏడాది దాటినా.. ఇంతవరకు హీరోయిన్ టైటిల్ ఫైనల్ కాలేదు. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ పేరు వినిపించినా.. కుదర్లేదు. ఓ దశలో సీనియర్ హీరోయిన్స్ ను అనుకున్నారు. ఎవరూ కుదరకపోయేసరికి మెగాస్టార్ తో జత కట్టిన భామనే రిపీట్ చేస్తున్నాడు. 


చిరంజీవి పక్కన సీనియర్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది. సైరా ఎక్స్ పీరియన్స్ తర్వాత మరోసారి నయనతార అయితేనే బాగుంటుందనుకున్నారు. మరి ఎందుకోగానీ.. ఆ ప్రయత్నం వదిలేశారు. అనుష్క పేరు వచ్చినా.. బొమ్మాళీకి డేట్స్ కుదర్లేదట. 


మెగాస్టార్ కు జోడీగా చాలామంది హీరోయిన్స్ పేర్లు వినిపించినా.. ఎవ్వరూ వర్కవుట్ కాలేదు. ఫ్రెష్ జోడీ అయితే బాగుంటుందని కొరటాల భావించాడట. మరి ఎందుకోగానీ.. చివరికి త్రిషను ఎంపిక చేశారు. నిర్మాత అఫిషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినా.. ీ పేరు ఖరారైనట్టేనట. 


త్రిష ఆల్ రెడీ మెగాస్టార్ తో స్టాలిన్ సినిమాలో జత కట్టింది. అప్పట్లో త్రిష చిరంజీవి పక్కన మరీ యంగ్ గా కనిపించింది. ప్రస్తుతం సీనియర్ లుక్ తో కనిపిస్తున్న త్రిష మెగాస్టార్ పక్కన సూట్ అవుతుందని చిత్ర వర్గాలు భావించాయి. ఖైదీ నెంబర్ 150 షూటింగ్ మొదలైన చాలా రోజుల తర్వాత కాజల్ దొరికితే.. ఈ సారి రెగ్యులర్ షూటింగ్ వెళ్లడానికి ముందే.. కథానాయిక సెలక్షన్ పూర్తి చేసేశారు. మొత్తానికి చిరంజీవికి హీరోయిన్ దొరికింది. వేసవి సెలవుల్లో మంచి కలెక్షన్స్ కొల్లగొడతామనుకున్న మెగాస్టార్ ఆ పనిలో  నిమగ్నమైపోయారు. దర్శకుడు కొరటాల శివకు మంచి బూస్ట్ ఇస్తూ.. జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. ఇంకేముందీ ఇప్పటికే ఓసారి చిరుతో చెట్టాపట్టాలేసిన ఆ ముద్దుగుమ్మ మరోసారి జోడీ కట్టేందుకు సిద్ధమైపోయింది. ఈ కాంబినేషన్ హిట్ కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: