ఇక్కడ శ్రీరెడ్డిని పొగడటం అని కాదు గాని... ఒక మాట స్పష్టంగా చెప్పవచ్చు. భారత సిని పరిశ్రమలో ఆమె ప్రభావం కాస్తో కూస్తో పడింది. శ్రీ రెడ్డి.. కేరాఫ్ కాంట్రవర్సీ.. నేమ్ ఆఫ్ సెన్సేషన్.. ఇలా ఎన్ని చెప్పినా కూడా తక్కువే. వాస్త‌వానికి ఆమె ఎప్పుడైతే రోడ్డు మీదకు వచ్చి క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడిందో ప్రతీ సిని పరిశ్రమలో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కొన్ని సిని పరిశ్రమల్లో క్యాస్టింగ్ కోచ్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. ఆమె ఎంత వివాదం రేపినా సరే... కొంత మందికి మాత్రం ధైర్యం ఇచ్చింది అనేది సిని పరిశ్రమలోనే కొందరి అభిప్రాయం.

 

ఇక అప్పటి నుంచి సిని పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి అనేది సిని వర్గాల అభిప్రాయం. ముఖ్యంగా తమిళం తెలుగులో అయితే చాలా మంది దర్శక నిర్మాతలు, ఇతరత్రా స్టార్ హోదా ఉన్న వాళ్ళు అయితే... ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. తెలుగు లో అయితే సినిమాల్లో అవకాశాలు కావాలని వచ్చిన వాళ్ళను... మళ్ళీ రమ్మనడం లేదా... టెస్ట్ చేయడమే గాని వాళ్ళతో ఎటు వంటి లావాదేవీలు గాని ఫోన్ కాంటాక్ట్ లు గాని పెట్టుకునే ప్రయత్నం చేయడం లేదని సమాచారం.

 

ఇటీవల అయితే... హీరోయిన్లతో కొందరు నిర్మాతలు మాట్లాడాలి అన్నా సరే భయపడిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారని కంగారు పడిపోతున్నారు. హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలని ఎవరైనా వచ్చినా సరే... ఇంత అయితేనే నటించండని చెప్పడమే గాని... ఇతర కథలకు అక్కడ అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ఇక ఏదేమైనా షూటింగ్ సమయంలో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా సరే వచ్చి మాకు చెప్పాలని నిర్మాతలు, దర్శకులు అండగా నిలుస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: