బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా rrr ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. రాజమౌళి రాత్రీపగలూ అంటూ తేడాలేకుండా కష్టపడుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో రాజమౌళి మరియు చిత్రయూనిట్ అంతా కలిసి చిత్రీకరిస్తున్నారు.
అలాగే ఆయన చిత్రం లో వారి పాత్రలను అప్పుడప్పుడు పండగలకు వారి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేస్తూ ఉంటాడు అంత జాగ్రత్త తీయనుకుంటున్న రాజమౌళి కి ఇంతలో ఓ అనుకోని పరిణామం చోటు చేసుకోవడంతో చిత్రయూనిట్‌పై రాజమౌళి ఫైర్ అయ్యారని తెలుస్తోంది. పైగా ఇందుకు కారణం ఎన్టీఆర్ అని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే
RRR సినిమా మొదలుపెట్టినపుడే ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్పిన రాజమౌళి ఆ తర్వాత ఆ సినిమాకి సంబందించిన ఎలాంటి విషయాలు ఇవ్వలేదు. శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు కానీ చిత్రానికి సంబంధించిన ఎలాంటి టీజర్ గాని లుక్స్ గాని బయటకు వదల్లేదు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉంటాయనే దానిపై మెగా, నందమూరి అభిమానుల్లో తెలుసుకోవాలన్న అభిలాష పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఎన్టీఆర్ లుక్ మరియు అతడి గెట్టాప్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ కొమురం భీం లుక్‌లో కనిపిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేషన్ సెట్ వేసి తీసిన సన్నివేశాలోనిది ఈ లుక్ అని తెలుస్తోంది. ఏదేమైనా కొమరం భీం లుక్‌లో ఎన్టీఆర్ అదిరిపోయేలా అనిపించాడు. దీంతో ఈ ఫోటో ఇండస్ట్రీలో వైరల్ అయింది.
దీంతో ఈ లీక్ గురించి తెలిసి రాజమౌళి చిత్రయూనిట్ పై సీరియస్ అయ్యారట. ఇప్పటి నుండి చిత్రానికి సంబందించిన లీకులు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఎన్టీఆర్ లుక్ నందమూరి అభిమానులకు కనువిందుగా మారింది.