ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోలో తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గరైన మెగా బ్రదర్ నాగబాబు . జబర్దస్త్ కి ముందు కేవలం సీరియస్ గా ఉండే వ్యక్తి గా మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన నాగబాబు.. జబర్దస్త్ ప్రారంభమైన తర్వాత నవ్వుల నాగబాబు గా మారిపోయారు. జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జడ్జి గా కొనసాగుతూ... జబర్దస్త్ టీం లీడర్ లందరిని ఎంకరేజ్ చేస్తూ... జబర్దస్త్ కి సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిన నాగబాబు గత కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ జడ్జి గా తప్పుకున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ జడ్జి గా తప్పుకున్న తర్వాత జీ తెలుగులో ప్రత్యక్షమయ్యారు నాగబాబు. ఇప్పటికే లోకల్ గ్యాంగ్ లో జడ్జిగా ప్రత్యక్షమైన నాగబాబు... ఇప్పుడు అదిరింది అనే కొత్త ప్రోగ్రాం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదిరింది మొదటి ఎపిసోడ్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. అయితే ఈ సందర్భంగా ఈ షో గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు మెగా బ్రదర్ నాగబాబు.
జబర్దస్త్ కి షో కి అదిరింది షో కి ఇదొక్కటే తేడా అంటూ తన యూట్యూబ్ ఛానల్ మై ఛానల్ నా ఇష్టం లో వీడియో పోస్ట్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. జబర్దస్త్ లాంటి పాపులర్ షో నడుస్తూనే ఉంటుంది... అలా అని ప్రేక్షకులు కొత్త కామెడిని చూడరు అనుకోవడానికి లేదు అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు నాగబాబు. జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని... అదిరింది షో తో తెలుగు ప్రేక్షకుల అందరి మనసులు గెలుచుకుంటామని నాగబాబు తెలిపారు. జబర్దస్త్ షో నుంచి జడ్జిగా తప్పకున్నాక ప్రేక్షకులందరికీ కాస్త దూరం అయ్యా ఏమో అని ఆలోచిస్తున్న తరుణంలో.. జీ తెలుగు లో ప్రసారమయ్యే అదిరింది లో తనకు జడ్జి గా అవకాశం వచ్చిందన్నారు నాగబాబు.
అదిరింది షో రెండు ఎపిసోడ్ లు బాగా వచ్చాయని... మొదటి ఎపిసోడ్ లో నిహారిక రెండో ఎపిసోడ్ లో నవదీప్ తనకు తోడుగా జడ్జి లుగా వ్యవహరించారని... తనతో పాటు వాళ్ళిద్దరూ కూడా కామెడీని ఎంతో ఎంజాయ్ చేశారు అంటూ నాగబాబు తెలిపారు. చాలా గ్యాప్ తర్వాత అదిరింది కామెడీ షో తో బుల్లితెర పై రి ఎంట్రీ ఇవ్వబోతున్న ధన్ రాజ్ వేణు సరికొత్త కామెడీ ని పంచుతున్నారని నాగబాబు తెలిపారు. మళ్లీ ఎలాగైనా తమ సత్తా చాటాలని నిశ్చయంతో వారు ఉన్నారని... అలాగే చమ్మక్ చంద్ర ఆర్పీ లు కూడా... ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సరికొత్త కాన్సెప్ట్ లతో ఐడియాలతో సిద్ధమయ్యారని నాగబాబు తెలిపారు. కొత్త కంటెస్టెంట్స్ కూడా తమదైన పర్ఫామెన్స్ అదరగోడుతున్నారని నాగబాబు అన్నారు. క్రియేటివిటి అనేది ఒక ఛానల్ లో ఒక సంస్థలో ఒక షోలో ఆగిపోయేది కాదని ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని నాగబాబు చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి